గంజాయి మత్తులో..ఆరేళ్ల బాలుడి పై లైంగిక దాడి!

గంజాయికి అలవాటు పడిన ఓ యువకుడు ఆ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఆరేళ్ల బాలుడితో నీచంగా ప్రవర్తించి గ్రామస్థుల చేతిలో తన్నులు తిన్నాడు.

New Update
గంజాయి మత్తులో..ఆరేళ్ల బాలుడి పై లైంగిక దాడి!

గంజాయికి అలవాటు పడిన ఓ యువకుడు ఆ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఆరేళ్ల బాలుడితో నీచంగా ప్రవర్తించి గ్రామస్థుల చేతిలో తన్నులు తిన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లాలోని పొన్నూరు పట్టణానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడు స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం కూడా పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన బాలుడు ఇంటి పరిసరాల్లో స్నేహితులతో కలసి ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అక్కడికి 20 ఏళ్ల నాగిశెట్టి పవన్ సంజయ్ అనే వ్యక్తి వచ్చాడు.

ఆ సమయంలో అతను పూర్తిగా గంజాయి మత్తులో ఉన్నాడు. దాంతో బాలుడిని చూసిన తరువాత అతడికి ఏం చేస్తున్నాడో తెలియని స్థితికి చేరుకున్నాడు. ఓ ఇంట్లోకి బాలుడిని లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు.

బాలుడు గట్టిగా అరవడంతో తలుపులు పగలగొట్టి నిందితుడిని బయటకు తీసుకుని వచ్చి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment