Astrology : ఏ రాసుల వారికి ఏ సమయంలో కొత్త పరిచయాలు అవుతాయో ఇప్పుడు చూద్దాం!

ఈ నెలలో ప్రేమ, రిలేషన్‌ల పరంగా మొత్తం 12 రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేసే అనేక గ్రహ సంచారాలు ఉంటాయి. 2024 మే నెల ప్రతి రాశి లవ్, రిలేషన్‌షిప్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలిద్దాం.

New Update
Astrology :  ఏ రాసుల వారికి ఏ సమయంలో కొత్త పరిచయాలు అవుతాయో ఇప్పుడు చూద్దాం!

Future : భవిష్యత్తును విశ్లేషించి చెప్పగలిగే జ్యోతిష్యానికి(Astrology) ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చాలా మంది వ్యక్తులు జ్యోతిష్యం ఆధారంగా తమ భాగస్వాములతో(Partners) రిలేషన్‌షిప్(Relationship) ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. ఇద్దరి జాతకాలను పోల్చడం ద్వారా వారి సంబంధం ఎలా ఉంటుందో పండితులు విశ్లేషిస్తారు. వ్యక్తులు పుట్టిన సమయంలో ఉన్న గ్రహాల స్థానాలు, వారి ప్రేమ జీవితాన్ని(Love Life) ప్రభావితం చేస్తాయి. ఇద్దరి మధ్య ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఆ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా జ్యోతిష్యం చెబుతుంది. కొద్ది రోజుల్లో మే ప్రారంభం కాబోతోంది. ఈ నెలలో ప్రేమ, రిలేషన్‌ల పరంగా మొత్తం 12 రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేసే అనేక గ్రహ సంచారాలు ఉంటాయి. 2024 మే నెల ప్రతి రాశి లవ్, రిలేషన్‌షిప్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలిద్దాం.

* మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)

మే నెల రిలేషన్‌లో కమ్యూనికేషన్‌పై దృష్టి పెడతారు. శుక్రుడు మిథునరాశిలోకి ప్రవేశించే మే నెలలో మీ ఆలోచనలు, భావోద్వేగాలను భాగస్వామితో పంచుకోవాలని భావిస్తారు. ఇది మీ ఇద్దరూ సన్నిహితంగా ఉండటానికి సహాయపడుతుంది. అయితే తొందరపడి మాట్లాడకూడదు. ప్రత్యేకించి అంగారకుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు, సంయమనం పాటించాలి. లేదంటే మీరు భావోద్వేగానికి గురికాక తప్పదు.

* వృషభం (ఏప్రిల్ 20 - మే 20)

ఈ మాసం వృషభరాశికి ప్రత్యేకమైంది. ఎందుకంటే మీ రాశిలో మీ పాలక గ్రహం శుక్రుడు ఉన్నాడు. దీని అర్థం మీరు అదనపు ఆకర్షణీయంగా ఉంటారు, అయస్కాంతం వలె భాగస్వాములను ఆకర్షిస్తారు. మీ ప్రస్తుత భాగస్వామితో మీ కనెక్షన్‌ని బలోపేతం చేయడానికి, రొమాంటిక్‌ ఇంట్రెస్ట్‌ కలిగించే కొత్త వారిని కలవడానికి ఇది సరైన సమయం.

* మిథునం (మే 21 - జూన్ 20)

మే 10న మీ రాశిలోకి శుక్రుడు సంచరిస్తాడు. దీంతో మిథునరాశి వారికి థ్రిల్లింగ్ సమయం. ఇది మీ ఆకర్షణను పెంచుతుంది, రొమాంటిక్‌ ఇంట్రెస్ట్‌ల దృష్టిని ఆకర్షించడం సులభం చేస్తుంది. ఇది కలిసిపోవడానికి, కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి, తాజా కనెక్షన్‌లను కనుగొనే కాలం.

* కర్కాటకం (జూన్ 21 - జూలై 22)

ఈ నెల మీ కోసం సంబంధాలలో భావోద్వేగ లోతు, సాన్నిహిత్యంపై దృష్టి పెడుతుంది. మీ రాశిలో కుజుడు ఉండటంతో, మీరు హృదయ సంబంధమైన విషయాల్లో మరింత ఆసక్తి కలిగి ఉంటారు. మీ సంబంధాలలో ఉద్రిక్తతను సృష్టించే అవకాశం ఉన్నందున, చాలా నియంత్రణలో జాగ్రత్తగా ఉండండి.

* సింహం (జూలై 23 - ఆగస్టు 22)

ఈ నెల సింహరాశికి రొమాన్స్‌, క్రియేటివిటీపై దృష్టిని తీసుకురాగలదు. మిథునరాశిలో శుక్రుడు ఉండటంతో, మీరు మీ ప్రేమను సృజనాత్మక మార్గాల్లో వ్యక్తీకరించడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. మీ సంబంధానికి ఆనందం, ఉత్సాహాన్ని తెస్తుంది. మీ భాగస్వామి కోసం రొమాంటిక్‌ సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయం.

* కన్య (ఆగస్టు 23 - సెప్టెంబర్ 22)

ఈ నెల మీ రిలేషన్‌షిప్‌లో స్థిరత్వం, భద్రతపై దృష్టి పెడుతుంది. మీరు మీ భాగస్వామితో బలమైన పునాదిని నిర్మించుకోవడంపై మరింత దృష్టి పెడతారు. పర్మినెంట్ రిలేషన్‌షిప్‌కి ఎంటర్ అవుతారు. మీ భాగస్వామితో మీ దీర్ఘకాలిక లక్ష్యాలు, ప్రణాళికలను చర్చించడానికి ఇది మంచి సమయం.

* తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)

ఈ నెల సోషల్‌ ఇంటరాక్షన్‌లు, స్నేహాలపై దృష్టి పెట్టవచ్చు. మీరు మీ సోషల్‌ సర్కిల్‌తో మరింత కనెక్ట్ అయినట్లు అనిపించవచ్చు. ఇది కొత్త రొమాంటిక్‌ అవకాశాలకు దారి చూపవచ్చు. మీ స్నేహితులు లేదా సోషల్‌ యాక్టివిటీస్‌ ద్వారా ప్రత్యేకంగా ఎవరైనా కలుసుకునే అవకాశం ఉంది. నెట్‌వర్క్, సోషలైజేషన్‌కి ఇది గొప్ప సమయం.

* వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)

ఈ నెల మీ కోసం కెరీర్, ప్రజా జీవితంపై దృష్టి సారిస్తుంది. మీ వృత్తిపరమైన లక్ష్యాలు, మీ రిలేషన్‌కి మధ్య బ్యాలెన్స్‌ కనుగొనాల్సి ఉంటుంది. మీ ప్రాధాన్యతలు, కమిట్‌మెంట్స్‌ గురించి మీ భాగస్వామితో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం.

* ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)

ఈ నెల మీ ప్రేమ జీవితంలో అనుకూల మార్పులు తెస్తుంది. మీరు మరింత సాహసోపేతంగా, కొత్త అనుభవాలకు తెరతీస్తారు. ఇది మీ రిలేషన్‌లో ఉత్తేజకరమైన పరిణామాలకు దారితీయవచ్చు. మీ భాగస్వామితో కొత్త కార్యకలాపాలు, ఆసక్తులను అన్వేషించడానికి, మీ బంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇది మంచి సమయం.

* మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)

ఈ నెల మీ రిలేషన్‌లో సాన్నిహిత్యం, భావోద్వేగ లోతుపై దృష్టి పెడతారు. మీ భాగస్వామితో లోతైన సంబంధాలను కలిగి ఉండటానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎక్కువ సాన్నిహిత్యం, అవగాహనను పెంపొందించుకుంటారు. మీ భావాలను, భావోద్వేగాలను మీ భాగస్వామితో ఓపెన్‌గా షేర్‌ చేసుకోవడానికి ఇది మంచి సమయం.

Also Read : మరికాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

నోయిడాలోని సెక్టార్ 168లో ఉన్న ఓ సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య వాట్సాప్ కాల్ విషయంలో వివాదం చెలరేగింది. అది కాస్త జుట్లు పట్టుకునే వరకు దారి తీసింది. ఒక మహిళ వేరొక మహిళ తల్లిని తిట్టిందని జుట్టు పట్టుకుని కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

New Update
noida woman grabs another by hair pins her down viral video

noida woman grabs another by hair pins her down viral video Photograph: (noida woman grabs another by hair pins her down viral video)

నోయిడాలోని ఓ సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య జరిగిన వ్యక్తిగత వివాదం తీవ్రతరమైంది. దాని ఫలితం దారుణమైన దాడికి దారితీసింది. ఓ మహిళ వేరొక మహిళ జుట్టు పట్టుకుని రప్పా రప్పా కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా మహిళలు గొడవ పడితే.. అది ఎంతవరకు అయినా దారి తీస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అది నడి రోడ్డు అని కూడా చూడరు. అయ్యో అందరూ ఉన్నారులే అని సైలెంట్‌గా ఉండరు. ఎవరుంటే మాకేంటి అన్నట్లు జుట్లు పట్టుకుని బాదుకుంటారు. తాజాగా అలాంటిదే నొయిడాలో జరిగింది. 

ఏం జరిగిందంటే?

సెక్టార్ 168లో ఉన్న నోయిడా సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య వాట్సాప్ కాల్ విషయంలో వివాదం చెలరేగింది. ఇద్దరు మహిళలు ఒకరినొకరు ఘోరంగా.. అతి దారుణంగా తిట్టుకున్నారు. అది కాస్త తిట్లతో ఆగకుండా కొట్లాట వరకు వెళ్లింది. ఆ ఇద్దరు మహిళలు ఒకే కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. వారిద్దరికీ మంచి పరిచయం ఉంది. ఒకరోజు వీరిద్దరిలో ఒక మహిళ వేరొక మహిళ తల్లిపై అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడింది. అలా మాటల యుద్ధం సాగిన తర్వాత చల్లబడ్డారు. 

కానీ ఒకే దగ్గర ఉండటంతో.. మరుసటి రోజు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో వారి వివాదం మరింత దారుణంగా మారింది. ఒక మహిళ మరొక మహిళ జుట్టు పట్టుకుని వదలకుండా కొట్టింది. పక్కనే ఉన్నవారు విడిపించాలని చూసినా ఆమె జుట్టు వదల్లేదు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

(viral-news | viral-video | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment