Kejriwal : కేజ్రీవాల్‌ అరెస్ట్‌!

మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది.

New Update
Kejriwal : కేజ్రీవాల్‌ అరెస్ట్‌!

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌ (Kejriwal) ను సీబీఐ (CBI) బుధవారం అరెస్ట్ చేసింది. మంగళవారం తీహార్‌ జైలు (Tihar Jail) లో ఉన్న కేజ్రీవాల్‌ ను సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. జైల్లో ఆయనను విచారించిన అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. బుధవారం ట్రయల్‌ కోర్టులో ప్రవేశ పెట్టిన తరువాత.. సీబీఐ ఆయన్ని అరెస్ట్‌ చేసింది.

కేజ్రీవాల్‌ ను కోర్టులో విచారించిన తరువాత ఆయన్ని అరెస్ట్ చేసేందుకు తమ వద్ద ఉన్నపత్రాలను సమర్పించేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) సీబీఐకి అనుమతి ఇవ్వడంతో ఈ అరెస్ట్‌ జరిగింది.

Also read: ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Advertisment
Advertisment
తాజా కథనాలు