CHANDRABABU CASE HEARING:నేడు కూడా ఏసీబీకోర్టులో కొనసాగనున్న వాదనలు

చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై ఎసిబి కోర్టులో నేడు కూడా వాదనలు కొనసాగనున్నాయి.స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో బెయిల్ , కస్టడీ పిటిషన్ లపై రెండు రోజులుగా ఎసిబి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నేడు మధ్యాహ్నం 12గంటల నుంచి 1:30 వరకు చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించనున్నారు.

New Update
CID filed memo: చంద్రబాబు రిమాండ్ పొడిగించండి.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ

ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, పిటిషన్ల మీద వాదనలు సుదీర్ఘంగా జరుగుతూనే ఉన్నాయి. రెండు రోజులుగా ఇవి కొనసాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం కోర్టు మరోసారి వీటిని విననుంది. చంద్రబాబు తరుఫున ప్రమోద్‌కుమార్ దూబే వాదిస్తుండగా సీఐడీ తరుఫున అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ఏఏజి అమలుకావాలని చెప్పారు. ఇరువురు వాదనల అనంతరం నేడు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.ఇప్పటికే చంద్రబాబు రిమాండ్‌ను అక్టోబర్19 వరకు పొడిగిస్తూ మరోసారి నిన్న ఎసిబి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈరోజుతో చంద్ర బాబు బెయిల్ ,కస్టడీ పిటిషన్ లపై స్పష్టత రానుంది.

మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో బాబు బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణ జరగనుంది. అలాగే ఫైబర్‌నెట్ స్కామ్‌ కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ మీద కూడా విచారణ జరుగుతుంది. ఇక ఈరోజు రాజమండ్రి సెట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణిలు కలవనున్నారు. ఈ నెల 12వ తేదీన ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో లోకేష్‌ను ఏపీ సీఐడీ విచారించనున్నారు. దీనికి సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికే నోటీసులను అందచేశారు.

ఇక త్వరలోనే టీడీపీ ప్రధాన కార్యదర్శి తన యువగాథల పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పాడు. అక్టోబర్ 9వ తేదీ లోపు చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని, ఆ తేదీ వరకు నిరసనలు కొనసాగుతాయని, చంద్రబాబు జైలు నుంచి విడుదలలో జాప్యం జరిగితే అక్టోబర్ 10 నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడతామని ఆయన చెప్పారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక 120 మంది చనిపోయారని, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చనున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. జనసేన పార్టీతో కలిసి పనిచేసేందుకు టీడీపీకి చెందిన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

also read:నేడే ముఖ్యమంత్రి అల్పాహార పథకానికి శ్రీకారం

Advertisment
Advertisment
తాజా కథనాలు