Shiv Sena Leader : ఆటో డ్రైవర్‌ తో గొడవ.. గుండె ఆగి చనిపోయిన శివసేన నేత కుమారుడు!

ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన రఘునాథ్ మోరే కుమారుడు మిలింద్ మోరే (45) ఆదివారం ఓ రిసార్ట్‌ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో కారుకు ఆటో అడ్డుగా రావడంతో అతనితో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో మిలింద్‌ గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు.

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Shiv Sena Leader Argument With Auto Driver : ఓ రాజకీయ నేత కుమారుడు కారుకు ఆటో అడ్డు వచ్చిన విషయంలో ఆటో డ్రైవర్‌ తో వాగ్వాదానికి దిగాడు. అయితే అదే సమయంలో గుండె పోటు (Heart Attack) రావడంతో నిల్చున్న చోటే కుప్పకూలిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర (Maharashtra) లోని పాల్గఢ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన రఘునాథ్ మోరే కుమారుడు మిలింద్ మోరే (45) ఆదివారం తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు నవపూర్‌లోని రిసార్ట్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వారి కారుకి ఓ ఆటో అడ్డుగా వచ్చింది. దీంతో మిలింద్‌ ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు.

ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా గుండెపోటు వల్ల చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్‌ అయిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. శివసేన థానే యూనిట్‌కు డిప్యూటీ చీఫ్‌గా మిలింద్ మోర్ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వివరించాయి.

Also read: ఇక నుంచి ఉదయం 5.30 గంటలకే మెట్రో సేవలు!


Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మొత్తం ఎన్ని కిలోలంటే?

ముంబై విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి వద్ద ఉన్న 6.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.6.3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

New Update
gold rates 123

Gold

ముంబై విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలో ఓ వ్యక్తి వద్ద 6.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా రూ.6.3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నిందితుడితో పాటు ఇంకొకరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

 

Advertisment
Advertisment
Advertisment