AP : వైసీపీ రౌడీ మూకలపై చర్యలు తీసుకోండి.. గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు!

ఏపీలో జరుగుతున్న అల్లర్లకు వైసీపీ రౌడీ మూకలే కారణమని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ ను కలిశారు టీడీపీ నేతలు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ గెలవబోతుందనే కోపంతో వైసీపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందన్నారు.

New Update
AP : వైసీపీ రౌడీ మూకలపై చర్యలు తీసుకోండి.. గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు!

TDP Leaders Met The Governor : పల్నాడు, మాచర్ల, తాడిపత్రిలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ ను కలిశారు టీడీపీ నేతలు. అలాగే శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని, ఎన్నికల(Elections) ముందు, ఎన్నికల అనంతరం శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలలో పేర్కొన్నారు.

ఈ మేరకు అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు దేశ విదేశాల నుంచి ఓటర్లు(Voters) స్వచ్ఛంధంగా తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు(YCP Leaders) పోలింగ్ బూత్ ల వద్ద గొడవలకు దిగారు. కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు, ఓట్లు వేసేందుకు వస్తున్న ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేశారు. పల్నాడులో వైసీపీ రౌడీ మూకలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. పోలింగ్ బూత్ ల దగ్గర పోలీస్ బందోబస్తు లేకుండా చేసి టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల పోలింగ్ బూత్ లను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేశారని కంప్లైట్ చేశారు.

గవర్నర్ ను కలిసిన వారిలో టీడీపీ పొలిట్ బ్యూరో(TDP Polit Beurre) మెంబర్ కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమ, వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, బిజెపి దినకర్ జనసేన చల్లపల్లి శ్రీనివాస్ తదితరులు కొల్లు రవీంద్రలు ఉన్నారు.

Also Read : తిరుమలలో మరోసారి చిరుత కలకలం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan : విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ

పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
pawan kalyan

pawan kalyan Photograph: (pawan kalyan)

Pawan Kalyan :పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు  పవన్ కళ్యాణ్  ఆదేశించారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు.  పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి అనే దానిపై విచారణ చేయాలని ఆదేశించారు.  సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా విషయాలను కూడా తెలుసుకోవాలన్నారు.తదితర అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు పవర్‌ కళ్యాణ్‌  ఆదేశాలు జారీ చేశారు.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఇప్పటికే పవన్ సూచించారు.కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ ,హెలికాప్టర్ లో వెళ్ళినా రోడ్డుపై ట్రాఫిక్ నిలవడం, చెట్లు కొట్టడం లాంటివి చేయడం ఆపడం లేదని తెలిపారు.పార్టీ శ్రేణులు, నాయకులకు సైతం క్రేన్ దండలు కార్యక్రమాలు, ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Also read :  Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్‌ లల్లాకు సూర్య తిలకం


కాగా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష కి ఆలస్యం అయిందని కొంతమంది విద్యార్థులు ఆరోపించారు. కన్వాయి వల్ల - పెందుర్తి అయాన్ డిజిటల్  JE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చిందని వాపోయారు. 30 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష   రాయకుండా వెనిదిరగాల్సి వచ్చింది. దీనివల్ల - పిల్లల భవిష్యత్తు అగమ్య అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Advertisment
Advertisment
Advertisment