Nara Lokesh: నారా లోకేశ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా!

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు చంద్రబాబు కుటుంబాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడంలేదు. ముందుస్తు బెయిల్ పిటిషన్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 12కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

New Update
చంద్రబాబు పేరుతో లెటర్..లోకేష్ సంచలన వ్యాఖ్యలు.!

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు చంద్రబాబు కుటుంబాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడంలేదు. ముందుస్తు బెయిల్ పిటిషన్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 12కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

గతంలో ఏం జరిగింది?
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో టీడీపీ నేత నారా లోకేశ్‌ను అక్టోబర్ 4(ఇవాళ్టి) వరకు అరెస్టు చేయకుండా సీఐడీ పోలీసులపై హైకోర్టు నాలుగు రోజుల క్రితం స్టే విధించింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా లోకేశ్ ను ఇంకా ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదని సీఐడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో తాను నిందితుడిని కాదని లోకేశ్ స్వయంగా చెప్పినందున ముందస్తు బెయిల్ పిటిషన్ లో వాస్తవం లేదని సీఐడీ పేర్కొంది.

అటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో లోకేశ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేస్తామని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తన తండ్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసులకు సంబంధించి లోకేశ్‌ ఢిల్లీలో మకాం వేసి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇక రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశారని, సీఆర్పీసీ సెక్షన్ 439 కింద దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఐఆర్ఆర్ కేసు కుట్రతో కూడిన 'లోతైన' ఆర్థిక నేరమని సీఐడీ అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టులో విచారణను ముందుగానే వాయిదా వేసేందుకు చంద్రబాబు నాయుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది.

పవన్‌ కళ్యాణ్‌కు నోటిసులు:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కృష్ణాజిల్లా పోలీసుల నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్ర (Varahi Yatra) పై రాళ్లదాడికి ప్లాన్ చేశారని నిన్న పవన్ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పవన్ ఆరోపణలకు ఏమైనా సాక్షాలు ఉన్నాయా? తెలుసుకోవడానికి నోటీసులు ఇచ్చామని ఎస్పీ జాషువా తెలిపారు. పవన్ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే తమకు అందించాలని పోలీసులు కోరారు. ఈ నోటీసుకు పవన్ కల్యాణ్ ఎలాంటి సమాధానం ఇస్తానన అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కృష్ణ జిల్లా పెడనలతో ఈ రోజు సాయంత్రం పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. నిన్న పవన్ చేసిన వాఖ్యల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 350 మందిని మోహరించారు. ఇదిలా ఉంటే.. వైసీపీ నేత జోగి రమేశ్ పవన్ వాఖ్యలపై స్పందించారు. తాను దగ్గరుండి పవన్ ను తీసుకెళ్తానన్నారు. జనం రాకనే పవన్ ఇలాంటి వాఖ్యలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

ALSO READ: పవన్ కల్యాణ్ కు ఏపీ పోలీసుల నోటీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు