చిక్కోలు చీటీ ఈసారి ఏమౌతుందో! చిక్కోలు జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీటు చిరగబోతుందా? వారి స్థానంలో కొత్త క్యాండిడేట్ల కోసం అధికార పార్టీ అన్వేషిస్తున్న ప్రక్రియ అవుననే సంకేతాలు ఇస్తోంది. By Bhavana 09 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి చిక్కోలు జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీటు చిరగబోతుందా? వారి స్థానంలో కొత్త క్యాండిడేట్ల కోసం అధికార పార్టీ అన్వేషిస్తున్న ప్రక్రియ అవుననే సంకేతాలు ఇస్తోంది.. ఇంతకీ ఆ మూడు నియోజకవర్గాలు ఏవి, వారిని తప్పించడానికి అధికార పార్టీ ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలుసుకోవాలని ఉందా అయితే ఈ పొలిటికల్ వార్ గురించి చదివేయండి. 2024 సార్వత్రిక ఎన్నికలు సమయం సమీపిస్తోంది.. గెలుపు గుర్రాలనే ఈ ఎన్నికల్లో బరిలోకి దించాలన్న ధృడ నిశ్చయంతో వున్న వైసీపీ ఇప్పటికే జిల్లాలో పవన్ కళ్యాణ్ టీం ను రంగంలోకి దించింది. ఆ బృందం ఇప్పటికే ఆమదాలవలస, పాతపట్నం ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేలో ఆ మూడు నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేల పై ఇటు పార్టీ శ్రేణులతో పాటు, ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వుందని సర్వేలో బయట పడిందంట.. Also read: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 9మంది మృతి..! వరుసగా రెండో ఘటన ఆమదాలవలస నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గానికి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత. పదిహేను ఏళ్ల పాటు ఆ నియోజకవర్గం ప్రజలు ఆయన్ని పక్కన పెట్టారు. అయినా ఆయన మాత్రం అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ ఆయా అధికార పార్టీ ఆకృత్యాలను ఎండగడుతూ వచ్చారు. ఆ పోరాట పటిమే 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. గెచిందే తడువుగా ఆయన పదిహేను ఏళ్ల పాటు తనతో వున్న కేడర్ ని మాత్రం దూరం పెట్టి 'కొత్త మోజు... పాత రోత' అన్న ఫార్ములాను అనుసరిస్తూ నేడు నాలుగు మండలాల్లో వున్న సెకెండ్ కేడర్ ను దూరం చేసుకున్నారని సమాచారం. మరో వైపు ఆ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే అయినా స్పీకర్ పదవిలో వుండడంతో ఆయనకు అధికార ప్రతినిధిగా అతని తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్ (నానీని) ప్రభుత్వం నియమించింది. దీంతో అతని పెత్తనం ఆ నియోజకవర్గంలో ఎక్కువగా సాగుతోంది అన్న ఆవేదన సెకెండ్ కేడర్ వెంటాడుతోంది. మరో వైపు ఆది నుంచీ తమ్మినేని సీతారాం విజయం వెనుక వున్న ఆ మహిళా శక్తి ఆయన భార్య కావడం గమనార్హం. ఆమె పెత్తనం ఎక్కువ కావడంతో కేడర్ వేరుకుంపటి పెట్టి వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాం కు టికెట్ రాదని, తమకే వస్తుందని కొందరు ఇప్పటికే ప్రచారం జరుపుకుంటున్నారు. ఇటువంటి మైనస్ లతో వున్న తమ్మినేనికి ఈ సారి చెక్ పెట్టాలని పీకే టీం నిర్వహించిన సర్వే నివేదికను పార్టీ అధిష్టానానికి పంపించినట్లు సమాచారం. మరి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలో తమ్మినేని సీతారాం స్ధానంలో ఎవరు ఆ కొత్త అభ్యర్థి అన్న క్యూరాసిటీ అందరిలో నెలకొంది. ఇక పాతపట్నం నియోజకవర్గం విషయానికి వస్తే రెడ్డి శాంతి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఘనతను ఆర్జించినా ఆ మేరకు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయలేదన్న నిస్పృహలో ప్రజలు వున్నారట. మరో వైపు ఆ పార్టీలో వున్న సెకెండ్ కేడర్ ఆమె నాయకత్వంలో పని చేయడానికి సుముఖత చూపక పోగా ఐదు మండలాల్లో పెద్ద ఎత్తున రేడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసారు. అంతేకాకుండా ఆమె నాన్ లోకల్ అన్న నినాదాన్ని సైతం తెరపైకి తెచ్చారు. ఈ విషయం పై ఇప్పటికే పార్టీ అధిష్టానానికి వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వోద్దని తీర్మానం కూడా చేసి పంపించారట... అట కాదు పంపించారు. ఇక ఎచ్చెర్ల నియోజకవర్గం విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ సీటు చిరిగేటట్లు కనిపిస్తోంది. ఇందుకు ఇటీవల విజయనగరం జిల్లా జిల్లా పరిషత్ ఛైర్మన్ చిన్న శ్రీను ఆ నియోజకవర్గంలో ఆయన పుట్టిన రోజు సంబరాలు ఆయన ప్రమేయం లేకుండా జరుపుకునే తీరు అద్దం పడుతోంది. శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో ఏకంగా 70 శాతం ఆదాయం తెచ్చిపెట్టే ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆయన ఈ జిల్లా కోర్టినేటర్ గా వ్యవహరిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను కావడం అసలు విషయం. మరో వైపు గొర్ల కిరణ్ కుమార్ పై ఆ నియోజకవర్గంలో సొంత పార్టీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వున్నట్లు వారు రోడ్ల పైకి వచ్చి 'కిరణ్ కుమార్ వద్దు... జగన్ ముద్దు' అని ఫెక్సీలు పెట్టి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఓ వైపు పీకే టీం నిర్వహించిన సర్వేలో కూడా ఈ విషయాలే నిర్ధారణ కావడంతో వారు పార్టీ అధిష్టానానికి గొర్ల కిరణ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో సీట్ ఇస్తే ప్రత్యర్ధి మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకట్రావు కావడంతో ఈ సారి ఆయనపై కిరణ్ గెలవడం కష్టమని తేల్చి చెప్పారని తెలుస్తోంది. ఇలా ఈ మూడు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థుల కోసం పీకే టీం నిర్వహించిన సర్వేలో వారికి కొత్త అభ్యర్థులు కావాలన్న సంకేతాలు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వెళ్లిపోయాయట. మరి వచ్చే ఎన్నికల్లో వీరి సీట్ చిరిగితే వచ్చే ఆ కొత్తవారి గెలుపు కోసం పని చేస్తారా లేదా వేరే పార్టీ కండువా అప్పుకుంటారా అన్న విషయం వేచి చూడాల్సిందే. #ap #politics #srikakulam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి