AP News: లెక్కచేస్తే.. డబ్బులు కట్టేస్తాం..సెక్రటేరియట్ సౌకర్యాలపై వైసీపీ వివరణ! ఏపీ మాజీ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పేరుతొ తీసుకున్న ఫర్నీచర్ తిరిగి అప్పగించకుండా వాడుకుంటున్నారు అని జరుగుతున్న ప్రచారంపై వైసీపీ వివరణ ఇచ్చింది. ఆ ఫర్నీచర్ విలువ, ఎంత వాపసు ఇవ్వాల్సి ఉంటుందో చెబితే డబ్బు చెల్లిస్తామని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి చెబుతున్నారు. By KVD Varma 16 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి AP News: ప్రజా నిధులతో సొంత ఇంటి సౌకర్యాలు కల్పించుకుని, ఓడిపోయిన తరువాత వాటిని ప్రభుత్వానికి అప్పగించకుండా సొంత అవసరాలకు వాడుకుంటున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై వైఎస్సార్సీపీ వివరణ ఇచ్చింది. ఈ విషయంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో అన్నారు. అవి జగన్ క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు AP News: జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై టీడీపీ దాడికి దిగిందని వైసీపీ విమర్శించింది. అప్పిరెడ్డి మాట్లాడుతూ “తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి హోదాలో జగన్ క్షేత్రస్థాయిలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఎవరు ఉన్నా తన క్యాంపు కార్యాలయానికి తగిన సౌకర్యాలు ఉండడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో జగన్ క్యాంపు కార్యాలయంలో కూడా ఏర్పాట్లు చేశారు.’’ అన్నారు. జాబితాను అధికారులకు అందజేశాం AP News: ప్రభుత్వం మారిన తర్వాత క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వస్తువుల జాబితాను ఇప్పటికే అధికారులకు అందజేశామని వైసీపీ తెలిపింది. ఫ్లెక్సిబిలిటీ ఇస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఫర్నీచర్ విలువ, ఎంత వాపసు ఇవ్వాల్సి ఉంటుందో చెబితే అంతా చెల్లిస్తామని ప్రభుత్వ అధికారులను కోరినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అయితే అప్పుడే ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రులు కూడా ఈ ప్రచారంలో పాల్గొనడం చాలా దురదృష్టకరమని అప్పిరెడ్డి అన్నారు. #ap-ycp #jagan-mohan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి