AP Minister Dharmana Prasada Rao: 14 ఏళ్లు సీఎం అయి ఉండి.. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశావా?: మంత్రి ధర్మాన ఫైర్

మేము చేయలేదు అంటున్నారు.. కనీసం మీరు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శనివారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు.. ప్రాజెక్టుల గురించి ప్రశ్నించడం ఏంటి? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించి తనకు అభిమానం ఉన్నట్లు, సాగునీటి ప్రాజెక్టులను.. వైసీపీ ప్రభుత్వం ఏదో విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో సీఎం అయి.. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అయిన మీరు ఏంచేశారు?, కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పగలరా? అంటూ అడిగారు. వంశధార ప్రాజెక్టుపై ఏనాడైనా పట్టించుకున్నారా?, గతంలో విద్యుత్ చార్జీలు ఎందుకు తగ్గించలేదు.. ఉచిత విద్యుత్ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు

New Update
Dharmana: వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్స్..!

మేము చేయలేదు అంటున్నారు.. కనీసం మీరు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శనివారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు.. ప్రాజెక్టుల గురించి ప్రశ్నించడం ఏంటి? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించి తనకు అభిమానం ఉన్నట్లు, సాగునీటి ప్రాజెక్టులను.. వైసీపీ ప్రభుత్వం ఏదో విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు.

1996లో సీఎం అయి.. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అయిన మీరు ఏంచేశారు?, కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పగలరా? అంటూ అడిగారు. వంశధార ప్రాజెక్టుపై ఏనాడైనా పట్టించుకున్నారా?, గతంలో విద్యుత్ చార్జీలు ఎందుకు తగ్గించలేదు.. ఉచిత విద్యుత్ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మరన్నారు. వ్యవసాయం దండగ అన్నది బాబే.. అతను రాసిన 'మనసులో మాట' పుస్తకంలోనే ఆ విషయం ఉందని స్పష్టం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

మా ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు అయ్యింది.. అందులో రెండేళ్లు కరోనా మహమ్మారే.. ఉంది. అయినా 97 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. వంశధార ప్రాజెక్టుపై ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్ సమావేశం అయ్యారని, రెండు వేల కోట్ల నిధులు ఖర్చు చేసిన ప్రాజెక్టు ఉపయోగంలోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు మంత్రి ధర్మాన. ట్రిబ్యునల్ వేయించావా? సమస్య పరిష్కారానికి ఒడిశా సీఎంతో మాట్లాడారా? అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు 14 ఏళ్లలో శాశ్వత పరిష్కారం సూచించలేదని ధ్వజమెత్తారు. రక్షిత తాగునీరు అందించేందుకు 700 కోట్లు కేటాయించి, ఒక్క టెర్మలోనే సర్పేస్ వాటర్ అందిస్తున్నామని చెప్పారు. కిడ్నీ రోగులకు, హాస్పిటల్‌ రీసెర్చ్ ఇన్టిట్యూషన్ , త్రాగునీరు , డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడంచారు. ఇది కదా పేదల ప్రభుత్వం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు మంత్రి ధర్మాన ప్రసాద రావు.

Advertisment
Advertisment
తాజా కథనాలు