Ambati Rambabu :'అమ్మా రేణూ మీ మాజీ'కి చెప్పు.. రేణుదేశాయ్ కి మంత్రి అంబటి కౌంటర్

సినీ నటి రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఈమేరకు రేణూ దేశాయ్ ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!' అని రాసుకొచ్చారు. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా రేణూ దేశాయ్ కి కౌంటర్లు ఇస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదికాస్తా వైరల్ గా మారింది.

New Update
Ambati Rambabu :'అమ్మా రేణూ మీ మాజీ'కి చెప్పు.. రేణుదేశాయ్ కి మంత్రి అంబటి కౌంటర్

Ambati Rambabu Counter to Renu Desai : సినీ నటి రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఈమేరకు రేణూ దేశాయ్ ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!' అని రాసుకొచ్చారు. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా రేణూ దేశాయ్ కి కౌంటర్లు ఇస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదికాస్తా వైరల్ గా మారింది.

కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడు పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు పదే పదే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే బ్రో ఈ సినిమా లో పృథ్వీరాజ్ పోషించిన శ్యాంబాబు అనే పాత్రను తనను ఉద్దేశించే పెట్టారంటూ గత కొద్ది రోజులుగా అంబటి రాంబాబు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్‌ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌ గా మారాయి.

రేణూ దేశాయ్ ఏమన్నారంటే..

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ఆయన మాజీ సతీమణి రేణూ దేశాయ్ (Renu Desai) గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిరోజు నుంచి రాజకీయాల్లో పవన్‌ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూనే.. ఆయన సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారని.. పవన్ ఓ అరుదైన వ్యక్తి అన్నారు. డబ్బు మనిషి కాదని.. అంటూ రేణూ దేశాయ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఇది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది.

రాజకీయాల్లో ఆయన చేస్తున్న సేవను గుర్తించండని సూచించారు. మంచి నటుడు స్టార్‌ హీరోగా ఉండి కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని పక్కనపెట్టి రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. దయచేసిన పవన్‌కు ఒక అవకాశం ఇవ్వండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండని చురకులు అంటించారు. ఇకనైనా పవన్ మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపండన్నారు. తన పిల్లలనే మిగిలిని ఇద్దరు పిల్లలను ఈ వివాదాల్లోకి లాగకండని కోరారు.

అలాగే బ్రో సినిమాలో నెలకొన్న శ్యాంబాబు వివాదంపైనా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారి తీశాయని తెలిసిందన్నారు. ఆ వివాదం గురించి తనకు అవగాహన లేదని.. కాకపోతే పవన్‌ పెళ్లిళ్లపై సినిమా తీస్తామని, వెబ్ సిరీస్ చేస్తామని కొందరు అన్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఓ తల్లిగా అభ్యర్థిస్తున్న పరిస్థితుల ఏమైనా సరే దయచేసి పిల్లలను ఇందులోకి లాగకండి అంటూ రేణూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

Also Read: `భోళాశంకర్‌` మూవీ ట్విట్టర్ రివ్యూ…మెగాస్టార్ హిట్ కొట్టినట్లేనా..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment