Andhra Pradesh: పిన్నెల్లికి ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

New Update
Andhra Pradesh: పిన్నెల్లికి ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Pinnelli Ramakrishna Reddy Bail Petition: ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో (AP High Court) బెయిల్ పటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రేపటికి తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 13న పోలింగ్ జరిగిన రోజు.. ఆ తర్వాత కూడా అల్లర్లు జరగంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.

Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. 5స్టార్ రేంజ్ లో మెనూ!

రెంటచింతల (Rentachintala) మండలం పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ నెంబర్ 202 లో టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు పై దాడి కేసులో 307 సెక్షన్‌తో పాటు మరికొన్ని సెక్టన్స్ కింద కేసు నమోదైంది. పోలింగ్ మూసిన తర్వాత రోజు కారంపూడిలో సిఐ నారాయణస్వామిపై దాడి కేసులో కూడా 307 సెక్షన్ కేసు నమోదైంది. అలాగే పాల్వాయి గేటు 202 బూత్ వద్ద చెరుకూరి నాగ శిరోమణి మీద జరిగిన దాడిపై మరి కొన్ని సెక్షన్ల కింద పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ ఇటీవల పిన్నెల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు తాజాగా తీర్పును రేపటికి రిజర్వు చేస్తూ.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Also Read: లక్కీ ఛాన్స్.. ఒకేచోట మూడు వజ్రాలు.!

Advertisment
Advertisment
తాజా కథనాలు