AP Government: చంద్రబాబు సర్కార్ సీరియస్.. మరో వికెట్ ఔట్!

ఏపీ ఎయిర్పోర్ట్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ భరత్ రెడ్డిపై చంద్రబాబు సర్కార్ వేటు వేసింది. ఆయను పదవి నుంచి తప్పించింది. భరత్ రెడ్డి ఐదేళ్లుగా చేసిన అవినీతిని బయటపెడతానని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

New Update
AP Government: చంద్రబాబు సర్కార్ సీరియస్.. మరో వికెట్ ఔట్!

CM Chandrababu Naidu: గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన వీఎన్‌ భరత్‌రెడ్డికి (Bharath Reddy) చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. ఆయనను AP ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (Airports Development Corporation) MD పదవి నుంచి తొలగించింది. భరత్‌రెడ్డి తీరుపై కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) ఘాటుగా స్పందించారు. భరత్ రెడ్డి వ్యవహారంపై ఆరా తీస్తున్నానన్నారు. పౌర విమానయాన శాఖలో గత 5ఏళ్లలో జరిగిన అవినీతిని బయటపెడుతానన్నారు. చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టిన భరత్ రెడ్డిని వదిలేది లేదని స్పష్టం చేశారు. బాబు బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత ఆయన హెలికాప్టర్ ల్యాండ్‌ కాకుండా ఇబ్బంది పెట్టాడని ఫైర్ అయినట్లు తెలుస్తోంది. జగన్‌కు వీరవిధేయత చూపిన భరత్ రెడ్డి బట్టలూడదీస్తానని రామ్మోహన్ నాయుడు అన్నట్లు సమాచారం.

Also Read: బాత్రూంల్లో గోల్డ్‌ కలర్‌ షవర్లు, కళ్లుచెదిరే బెడ్స్‌.. రుషికొండ భవనం ప్రత్యేకతలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు