Andhra Pradesh: తల్లికి వందనం పథకానికి విధివిధానాలు

తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందించింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం.దీనికి అప్లై చేసుకోవాలంటే వెంటనే ఆధార్ కార్డు పొందాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బి పి ఎల్ కుటుంబాల తల్లులకు ఈ పథకం వర్తింపు చెయ్యాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది.

New Update
Andhra Pradesh: తల్లికి వందనం పథకానికి విధివిధానాలు

Talliki vandanam Scheme: ఒకటో తరగతి నుండి ఇంటర్ విద్యార్థులు ఆధార్ నెంబర్ పొందాలని ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆధార్ నమోదు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. తల్లికి వందనం పథకం పొందాలంటే ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలని చెప్పింది. బి పి ఎల్ కుటుంబాల తల్లులకు ఈ పథకం వర్తింపు చెయ్యాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది.

సూళ్ళల్లో 75 శాతం హాజరు ఉన్నవారికే తల్లికి వందనం కింద 15000 రూపాయలు అమలు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ఉన్న అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనం గా పేరు మార్చింది ఇప్పటి కూటమి గవర్నమెంట్. ఇప్పుడు దీని కోసమే విద్యార్థులు ఆధార్ నమోదు చేసుకోవాలని ఆదేశించింది. తల్లికి వందనం, స్కూల్ కిట్ పథకాలు ఆధార్ ధ్రువీకరణ ద్వారా అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

publive-image publive-image publive-image publive-image publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు