Sajjala: టీడీపీ నేతల దీక్షలపై సజ్జల సెటైర్లు.. పూనకాలు వద్దంటూ పవన్ పై ఫైర్

చంద్రబాబు (Chandrababu) జైల్లో ఉంటే గాంధీని అవమానించేలా టీడీపీ నేతలు దీక్ష చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతలు మంచి లక్ష్యాలతో నిరాహారదీక్ష చేస్తే బాగుండేదన్నారు. చంద్రబాబు నవ నిర్మాణం అనేది ఉత్త బోగస్ అంటూ ఎద్దేవా చేశారు.

New Update
Sajjala: టీడీపీ నేతల దీక్షలపై సజ్జల సెటైర్లు.. పూనకాలు వద్దంటూ పవన్ పై ఫైర్

మహానుభావుల అడుగుజాడల్లో నడిచే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (AP CM YS Jagan) అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishnareddy) అన్నారు. ఈ రోజు గాంధీ జయంతి (Gandhi Jayanthi) సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు (Chandrababu) జైల్లో ఉంటే గాంధీని అవమానించేలా టీడీపీ నేతలు దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు మంచి లక్ష్యాలతో నిరాహారదీక్ష చేస్తే బాగుండేదన్నారు. చంద్రబాబు నవ నిర్మాణం అనేది ఉత్త బోగస్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ మధ్య మేధావులు క్యశ్చన్ చేస్తా అని వస్తున్నారన్నారు. మానసికంగా ప్రశ్నించే స్థాయికి నిస్సహాయ వర్గాలు రావాలన్నారు. అవకాశం ఉన్న ప్రతీ చోటా పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పారు సజ్జల.
ఇది కూడా చదవండి: Big Breaking: టీడీపీ మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు

ఇంకా.. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం ఇచ్చామన్నారు. ఓట్ల కోసం తాము కాళ్ల మీద పడడం లేదన్నారు. ప్రజలకు అన్నీ చేశామన్న ధీమాతోనే సీఎం జగన్ ధైర్యంగా ఓట్లు అడుగుతున్నారు. ఎన్నికల వేళ ఆవేశంగా పూనకం వచ్చినట్లు మాట్లాడటం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ను ఉద్ధేశించి వాఖ్యానించారు సజ్జల. కేసు బలంగా ఉందని కోర్టు చెప్తే అక్రమ అరెస్ట్ అని బరితెగిస్తున్నారని టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. నిస్సిగ్గుగా ఇలాంటి వారితో జత కడతామని ముందుకొస్తున్నారంటూ జనసేన నేతలపై మండిపడ్డారు సజ్జల. రాష్ట్రం గురించి పట్టించుకునే మేధావులు ఇలాంటి విషయాల పై ఆలోచన చేయాలని కోరారు.

చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ఏపీలో టీడీపీ నేతలు ఈ రోజు దీక్షలకు దిగారు. చంద్రబాబు నాయుడు సైతం రాజమండ్రి జైలులో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. నారా భువనేశ్వరి రాజమండ్రిలో, లోకేష్ ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. అయితే.. వీరి దీక్షలపై వైసీపీ నేతలు మండి పడుతున్నారు. దోపిడి చేసి అరెస్ట్ అయిన వ్యక్తికి మద్దతుగా దీక్షలు చేయడం సరికాదంటూ సెటైర్లు వేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు