AP Game Changer: కడపలో కింగ్ ఎవరు? ఏ సీటులో ఎవరు గెలుస్తారు? రవిప్రకాష్ సంచలన లెక్కలివే!

హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో కడప జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుస్తుంది? అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి? తదితర పూర్తి వివరాలతో కూడిన ఆర్టీవీ స్టడీ లెక్కలను వివరించారు రవిప్రకాశ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

New Update
AP Game Changer: కడపలో కింగ్ ఎవరు? ఏ సీటులో ఎవరు గెలుస్తారు? రవిప్రకాష్ సంచలన లెక్కలివే!

AP Elections 2024 Survey By Ravi Prakash: హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో కడప జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుస్తుంది? అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి? తదితర పూర్తి వివరాలతో కూడిన ఆర్టీవీ స్టడీ లెక్కలను వివరించారు రవిప్రకాశ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కడపలో 10 అసెంబ్లీ సీట్లు ఉండగా.. YS కుటుంబానికి పెట్టని కోటగా వున్న పులివెందుల నుంచే సీఎం జగన్‌ ఈసారి కూడా బరిలోకి దిగారు. బీటెక్‌ రవి అలియాస్‌ మారెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది. పులివెందులలో జగన్‌ విజయం ఖాయమంటోంది ఆర్టీవీ స్టడీ.

జగన్‌కు ప్లస్‌ పాయింట్‌..
సీఎం హోదా జగన్‌కు ప్లస్‌ పాయింట్‌. అయితే షర్మిల కడప ఎంపీగా బరిలోకి దిగడం మైనస్‌ పాయింట్. ఇది జగన్‌ మెజారిటీపై ప్రభావం చూపుతుందని ఆర్టీవీ స్టడీలో తేలింది. రైతుల్లో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ అంశాలు కొంత నెగెటివ్‌ ప్రభావం చూపుతున్నా.. జగన్‌ విజయాన్ని అడ్డుకునే పరిస్థితి లేదు.
AP Elections 2024 Survey By Ravi Prakash

జమ్మలమడుగు సుధీర్‌ రెడ్డికే చాన్స్..
ఇక ఈ జిల్లాలో మరో కీలక సెగ్మెంట్‌ జమ్మలమడుగు. పొత్తులో భాగంగా కూటమి నుంచి ఈ సీటును బీజేపీకి ఇచ్చారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. YCP నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మూలె సుధీర్‌ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డికి వైఎస్‌ ఫ్యామిలీ అండ అతిపెద్ద ప్లస్‌ పాయింట్‌. అవినీతి ఆరోపణలు మైనస్‌ పాయింట్‌. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి...ఆదినారాయణ రెడ్డికి ప్లస్‌ పాయింట్‌. కాకపోతే బీజేపీలో చేరిన తర్వాత క్యాడర్‌ని నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు వున్నాయి. వీరిద్దరిలో చివరికి వైసీపీ అభ్యర్థి సుధీర్‌ రెడ్డిదే విజయమని ఆర్టీవీ స్టడీలో తేలింది.
AP Elections 2024 Survey By Ravi Prakash

ప్రొద్దుటూరు..
ఇక ప్రొద్దుటూరు విషయానికి వస్తే..వైసీపీ అభ్యర్ధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.. టీడీపీ అభ్యర్ధి నంద్యాల వరదరాజుల రెడ్డి. టీడీపీ అభ్యర్ధికే విన్నింగ్ ఛాన్స్ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న అవినీతి ఆరోపణలు ప్రభావం చూపిస్తున్నాయి.
AP Elections 2024 Survey By Ravi Prakash

బద్వేల్
కడపలో మరో ముఖ్యమైన నియోజకవర్గం బద్వేల్. ఇక్కడ వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

రాజంపేట
రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న సుగవాసి సుబ్రహ్మణ్యం గెలవబోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

కడప 
కడప నుంచి బరిలోకి దిగుతున్న వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషా గెలిచే అవకాశం ఉంది.

కోడూరు
కోడూరులోనూ వైసీపీ అభ్యర్థి కే.శ్రీనివాసులు విజయం సాధించే అవకాశం ఉంది.

రాయచోటి
రాయచోటిలోనూ వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి అధిపత్యమే కనిపిస్తోంది.

పులివెందుల 
పులివెందులనుంచి బరిలోకి దిగుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయం నల్లేరుమీద నడకగానే చెప్పొచ్చు.
publive-image

కమలాపురం
కమలాపురం బరిలో దిగుతున్న వైసీపీ అభ్యర్థి పి. రవీంధ్రనాథ్ రెడ్డి గెలవబోతున్నట్లు తెలుస్తోంది.

మైదుకూరు
మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

Also Read: అనంతపురంలో ఆ పార్టీదే హవా.. నియోజకవర్గాల వారీగా రవిప్రకాష్ చెప్పిన లెక్కలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు