AP Game Changer : చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్లు ఆ పార్టీకే.. రవిప్రకాష్ లెక్కలు ఏం చెబుతున్నాయంటే? హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుస్తుంది? అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి? తదితర పూర్తి వివరాలతో కూడిన ఆర్టీవీ స్టడీ లెక్కలను వివరించారు రవిప్రకాశ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. By srinivas 02 May 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Chittoor : ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. 14 అసెంబ్లీ(Assembly) సీట్లు ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబు(Chandrababu) పై భరత్‌ని బరిలోకి దింపింది వైసీపీ(YCP). బీసీ సామాజిక వర్గం భరత్ వైపు పోలరైజ్ అవుతుందన్న నమ్మకంతో ఆయనకు అవకాశమిచ్చారు. గత నాలుగు దశాబ్దాలుగా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న చంద్రబాబే ఈసారి కూడా కుప్పం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. వైసీపీ బీసీ వ్యూహం సక్సెస్సయితే చంద్రబాబు మెజారిటీ తగ్గే అవకాశం కనిపిస్తోంది. హాట్ సీటు పుంగనూరు.. జిల్లాలో మరో హాట్ సీటు పుంగనూరు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) మరోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ చల్లా బాబును బరిలోకి దింపింది. పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కంచుకోట. బలమైన క్యాడర్ ప్లస్ పాయింట్. కాకపోతే అవినీతి ఆరోపణలు మైనస్‌గా కనిపిస్తున్నాయి. ఇక టీడీపీ అభ్యర్థి చల్లా బాబుకున్న క్లీన్ ఇమేజ్ ఆయనకు పాజిటివ్ టాక్ వచ్చేలా చేస్తోంది. వీరిద్దరు కాకుండా BCY పార్టీ తరపున బరిలో వున్న రామచంద్రయాదవ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంతిమంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే పుంగనూరు సీటని ఆర్టీవీ స్టడీలో తేలింది. Also Read : జగన్ దుర్మార్గపు పాలన అంతం అవ్వడం ఖాయం.. బుడ్డా రాజశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..! రోజా ఓటమి ఖాయమేనా? సినీ నటి రోజా(Roja) నియోజకవర్గం నగరి. టీడీపీ నుంచి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాశ్‌కు పోటీలో ఉన్నారు. అవినీతి ఆరోపణలు, పార్టీలో వ్యతిరేకంగా మొదలైన గ్రూపులు రోజా ఓటమికి దారితీస్తున్నాయని మా స్టడీలో తేలింది. అనుభవం లేకపోవడం, సొంతింటిలోనే ఇబ్బందికరమైన వాతావరణం వుండడం భానుప్రకాశ్‌కు కాస్త నెగెటివ్. అయినా.. అంతిమంగా ఇక్కడ టీడీపీ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఇతర స్థానాల్లో లెక్కలు ఇలా.. తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యర్థి జయచంద్రా రెడ్డి గెలిచే అవకాశం ఉంది. అలాగే పీలేరులో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక మదనపల్లెలో వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న నిస్సార్ అహ్మద్ గెలిచే చాన్స్ ఉంది. పుంగనూరు నుంచి బరిలో నిలుస్తున్న వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజలో ఉండబోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. చంద్రగిరిలోనూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలవబోతున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలోనూ వైసీపీ అభ్యర్థి భూమన అభియన్ రెడ్డి, శ్రీకాళహస్తిలో టీడీపీ నుంచి బొజ్జల వెంటక సుధీర్ రెడ్డి, సత్యవేడు నుంచి వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్, నగరిలో టీడీపీ నుంచి గాలి భాను ప్రకాశ్, గంగాధర నెల్లూరులో వైసీపీ డాక్టర్ వీఎం థామస్.. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్, పూతలపట్టులో వైసీపీ నుంచి మూలిరేవుల సునీల్ కుమార్, పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎం.అమర్ నాథ్ రెడ్డి, కుప్పం టీడీపీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది. #ap-ycp #chittoor-district #ap-politics-2024 #ap-game-changer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి