Andhra Pradesh : మాజీ సీఎస్ జన్నత్ హుస్సేన్ కన్నుమూత ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ప్రిన్సిపల్ ఛీఫ్ సెక్రటరీగా పని చేసిన ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజామున సూళ్ళూరుపేటలోని తన రెండో కొడుకు నివాసంలో తుది శ్వాస విడిచారు. By Manogna alamuru 23 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Jannath Hussain : ఉమ్మడి ఏపీ(AP) లో చంద్రబాబు(Chandra Babu), వైఎస్ రాజశేఖర్ రెడ్డి లు ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో ప్రిన్సిపల్ ఛీఫ్ సెక్రటరీగా పని చేసిన ఐఏఎస్ ఆఫీసర్ జన్నత్ హుస్సేన్(IAS Officer Jannat Hussain) ఈరోజు మరణించారు. గత కొంతకాలంగా అల్జీమర్స్ తో బాధపడుతున్న ఆయన సూళ్ళూరుపేటలోని తన నివాసంలో కన్నుమూశారు. 1977 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జన్నత్ హుస్సేన్ రెండు సార్లు సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2010 డిసెంబరు 31న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన రిటైర్ అయ్యారు. తరువాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జన్నత్ 2014 వరకూ ఆ పదవిలోనే ఉన్నారు. ఉచిత్ విద్యుత్ విధివిధానాలు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణం స్వీకారం తరువాత ఉచిత విద్యుత్ మీద మొట్టమొదటి సంతకం చేశారు. అప్పుడు ఆయనకు ఆ ఫైల్‌ను అందించింది జన్నత్ హుస్సేనే. అంతేకాదు అప్పుడు ఉచిత విద్యుత్ విధివిధానాల్ని రూపొందించింది కూడా ఆయనే. జన్నత్‌కు భార్యా, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. సూళ్లూరుపేటలో తన రెండో కొడుకు వద్ద ఉంటున్న జన్నత్ అల్జీమర్స్(Alzheimer's) వ్యాధి బారిన పడ్డాక అన్నీ మర్చిపోయారు. తాను చేసిన పనులు కానీ, తానెవరు అన్న విషయం కానీ జన్నత్‌కు గుర్తులేకుండా పోయిందని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జన్నత్ హుస్సేన్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, అధికారులు సంతాపం ప్రకటించారు. Also Read : Lasya Nandita : వెంటాడిన వరుస ప్రమాదాలు..మూడోసారి మృత్యుఒడిలోకి #andhra-pradesh #ex-cs #jannat-hussain #alzheimers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి