AP Game Changer : విజయనగరం పార్లమెంట్‌లో వైసీపీదే విక్టరీ.. ఆర్టీవీ సర్వేలో తేలిన లెక్కలివే!

విజయనగరం ఎంపీగా వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్‌, టీడీపీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పోటీలో ఉన్నారు. ఆర్టీవీ సర్వేలో వీరిలో గెలుపు ఎవరిదని తేలిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

New Update
AP Game Changer : విజయనగరం పార్లమెంట్‌లో వైసీపీదే విక్టరీ.. ఆర్టీవీ సర్వేలో తేలిన లెక్కలివే!

Vijayanagaram : విజయనగరం పార్లమెంట్‌ సీటులో వైసీపీ(YCP) నుంచి సిట్టింగ్‌ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మరోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ(TDP) నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పాతికేళ్ల నుంచి పార్టీలో ఉన్నా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌గా పార్టీ కార్యకర్తలకు ట్రైనింగ్‌ ఇచ్చారు. అదే ఈ ఎన్నికల్లో(Elections) ఈయనకు ప్లస్‌ పాయింట్. కానీ స్థానికేతరుడు కావడం అప్పలనాయుడుకి మైనస్‌.

publive-image publive-image

అయితే మంత్రి బొత్స ప్రభావం, చంద్రశేఖర్‌ వ్యక్తిగత ఇమేజ్‌ వైసీపీకి ప్లస్‌. పార్లమెంట్‌(Parliament) పరిధిలోని చీపురుపల్లిలో మంచి పట్టు ఉంది. విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎచ్చర్ల, రాజాం అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడింటిలో ఐదు చోట్ల చంద్రశేఖర్‌కు బంధుగణం ఉంది. గెలుపు కోసం స్థానికంగా ఆయన బంధువులు కష్టపడుతున్నారు.

publive-image

Also Read : స్కిల్స్ పెంచుకోవడంలో మహిళలే టాప్.. ఈ లెక్కలు చూడండి..

publive-image

4 అసెంబ్లీ సెగ్మెంట్లలో బొత్సకు గట్టి పట్టు ఉండటం వైసీపీకి ప్లస్‌. ఎంపీ నిధులతో చేసిన అభివృద్ధి కలిసి వస్తుందని చంద్రశేఖర్‌ అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ సీటులో టీడీపీకి పడే ఓట్లలో కొంత వరకు ఎంపీ ఎన్నికలో వైసీపీకి క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. అందుకే విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో మరోసారి వైసీపీకి గెలిచే అవకాశం ఉన్నట్టు మా స్టడీలో తేలింది.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News: మొత్తానికి అలేఖ్య పాపని ఏడిపించేశారు కదరా.. వెక్కి వెక్కి ఏడుస్తున్న చిట్టి (వీడియో వైరల్)

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

New Update
BREAKING NEWS

breaking news

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

 

latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news telugu | latest telangana news | andhra-pradesh-news | international news in telugu | national news in Telugu | telugu crime news | telugu-cinema-news | telugu-film-news | telugu-sports-news | telugu-cricket-news | latest technology news in telugu | business news telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు