AP Politics : వారిపై చట్టపరమైన చర్యలు.. ఏపీ మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఫైర్ అయ్యారు. ప్రజల ఆస్తులను వైసీపీ ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారం పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. By Nikhil 30 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Land Title Act : ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు(Karumuri Nageshwara Rao) మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్(NITI Aayog) సూచనలతో తీసుకొచ్చిన మోడల్ యాక్ట్ పై అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతోందన్నారు. ఈ యాక్ట్ అమలు విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. సినీ నటులతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది కూడా చదవండి: TDP-JSP Manifesto: మేనిఫెస్టోపై కనిపించని బీజేపీ నేతల ఫొటో.. హామీలకు బీజేపీ గ్యారెంటీ లేదా? ప్రజల ఆస్తులను వైసీపీ(YCP) ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారం పై ఎలక్షన్ కమిషన్(Election Commission) కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. తప్పడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రం అమలు చేసే యాక్ట్ పై కూటమిలో ఉన్న టీడీపీ(TDP), జనసేన(Janasena) నేతలు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. తణుకు టీడీపీ అభ్యర్థి సైతం సోషల్ మీడియాలో దుర్మర్గమైన రీతిలో వ్యవహరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. #ycp #niti-aayog #election-commission #karumuri-nageshwara-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి