AP Elections 2024: మాకు మరో సీటు ఇవ్వాలంటున్న బీజేపీ.. కూటమిలో మళ్లీ లొల్లి!

ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. తాజాగా బీజేపీ మరో అసెంబ్లీ సీటు కోసం డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. సోము వీర్రాజు కోసం అనపర్తికి బదులుగా రాజమండ్రి సిటీ లేదా రూరల్‌లో ఏదో ఒకటి బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది.

New Update
AP Elections 2024: మాకు మరో సీటు ఇవ్వాలంటున్న బీజేపీ.. కూటమిలో మళ్లీ లొల్లి!

BJP Demanding One More Seat: ఏపీలో కూటమి పార్టీల మధ్య మళ్లీ సీట్ల పంచాయితీ మళ్లీ మొదలైంది. తమకు మరో అసెంబ్లీ సీటు అదనంగా ఇవ్వాలని బీజేపీ (BJP) అడగడమే ఇందుకు కారణం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తాము 11 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పడం ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది. అయితే.. ఏ సీటు, ఏ పార్టీ కోటాలో నుంచి ఇస్తారనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. రాజంపేట లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఉమ్మడి కడప జిల్లాలో మూడు స్థానాలు కష్టమని తెలుగుదేశం దేశం పార్టీ (TDP) స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. సోము వీర్రాజు కోసం అనపర్తికి బదులుగా రాజమండ్రి సిటీ లేదా రూరల్‌లో ఏదో ఒకటి ఇవ్వాలని బీజేపీ అడుగుతోంది. అయితే.. ఆ రెండు తమ సిట్టింగ్ స్థానాలు కావడంతో తెలుగుదేశం ఒప్పుకోవట్లేదు. దీంతో తెలుగుదేశం పార్టీతో బీజేపీ చర్చలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Kishan Reddy: ఫోన్ ట్యాపింగ్ తో వారి జీవితాలతో ఆటలు.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మాట్లాడుతూ.. పొత్తుల్లో వచ్చిన సీట్ల ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఢిల్లీ నుండి ఎన్నికల సమన్వయకర్తలు వచ్చారన్నారు. ఎన్నికల ప్రిపరేషన్ పై సమావేశంలో చర్చించామన్నారు. కార్యకర్తల నుంచి వారు సమస్యలు అడిగి తెలుసుకున్నారన్నారు. టీడీపీ, జనసేన నుండి సహకారం పై కార్యకర్తలను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు వివరించారు.

త్వరలోనే రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు వేయాలని నిర్ణయించామన్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకోసం సమన్వయంతో పని చేయాలని సూచించారు. పొత్తులో వచ్చిన సీట్లు ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చెప్పారు. పొత్తులో తమకు విశాఖ సిట్ రాలేదన్నారు. ఒక్కరికి తప్పా బయట వారికి ఎవ్వరికీ సిట్ ఇవ్వలేదన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు