Jagan-Chandrababu: జగన్ కు చంద్రబాబు మరో బిగ్ షాక్.. ఆ శాఖలో అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం!

వైసీపీ అధినేత జగన్ కు ఏపీ సీఎం చంద్రబాబు మరో బిగ్ షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మైనింగ్ లో జరిగిన అక్రమాల పై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఈ ఆదేశాలు జారీ చేశారు.

New Update
Jagan-Chandrababu: జగన్ కు చంద్రబాబు మరో బిగ్ షాక్.. ఆ శాఖలో అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం!

వైసీపీ అధినేత జగన్ కు (YS Jagan) ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) మరో బిగ్ షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మైనింగ్ లో జరిగిన అక్రమాల పై సీఐడీ విచారణకు (CID Enquiry) ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఉచిత ఇసుక పాలసీ అమలులో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అక్రమాలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఇసుక అక్రమాలను చూస్తూ ఊరుకుంటే కలెక్టర్లను కాల్‌ బ్యాక్ చేస్తానని స్పష్టం చేశారు. ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇసుక సరఫరాలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఇసుక సరఫరాలో ప్రతి స్టెప్‌ను డిజిటలైజేషన్‌ చేస్తామన్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక పాలసీని రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఫ్రీ ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు ఇసుకను దోపిడీ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక మైనింగ్ పై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లిక్కర్ అమ్మకాల్లో జరిగిన అవకతవకలపై సీఎం చంద్రబాబు సీఐడీ విచారణకు ఆదేశించారు. భారీగా నగదు లావాదేవీలు జరిగినందుకు ఈ కేసును ఈడీకి కూడా రిఫర్ చేస్తామన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రకటన చేశారు చంద్రబాబు. తాజాగా ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో ఇసుక మైనింగ్ అంశంపై సీఐడీ విచారణకు ఆదేశించారు చంద్రబాబు. దీంతో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయనే అంశంపై వైసీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Also Read: ప్రతీ నెల 1న ‘పేదల సేవలో’ కార్యక్రమం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు