Andhra Pradesh: కేంద్ర పదవులు ఆశించడం లేదు.. జాతీయ మీడియాతో చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా అక్కడ ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే ఎజెండా లక్ష్యంగా ముందుకెళ్తు్న్నామని.. మాకు కేంద్రంలో పదవులపై ఆశ లేదని పేర్కొన్నారు. By B Aravind 05 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా అక్కడ ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..' ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే నా ఎజెండా, నా లక్ష్యం. ఆ దిశగానే నా రెండు రోజుల ఢిల్లీ పర్యటన సాగింది. కేంద్ర పెద్దల నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. మాకు పదవులు మరొకదానిపై ఆశ లేదు, ఒత్తిడి చేయలేదు. వాజ్‌పేయ్ హయాంలోనూ ఏడు క్యాబినెట్ పదవులు ఇస్తామన్న తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వంలో కీలక నేతలతో పోస్టుల గురించి పదవుల గురించి ఏమాత్రం మాట్లాడలేదు. Also read: సంచలన నిర్ణయం తీసుకున్న జగన్.. 24 మంది సస్పెండ్! రాష్ట్రానికి సహాయ సహకారాలే మాకు అవసరం. ఏపీ ప్రజలు భూతాన్ని (జగన్) వదిలించుకున్నారు. పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరిచాం. ఆ భూతంను చూసి ఇప్పటికి కూడా పెట్టుబడిదారులు ముందుకు వచ్చేందుకు భయపడుతున్నారు. జగన్ హయాంలో అమరావతి, పోలవరం సహా ఏపీ విధ్వంసానికి గురైంది. రాష్ట్ర విభజన సమయంలో కూడా నేను సమ న్యాయమని చెప్పాను. రెండు రాష్ట్రాలు పరస్పరంగా, ఆమోదయోగ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనేది నా ఉద్దేశం. సోదరులైన రెండు రాష్ట్రాల ప్రజలు విడిపోయినా.. కలిసిమెలిసి ముందుకు సాగాలనేది నా అభిమతం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశంలో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. అమరావతిని గ్లోబల్ లీడర్‌గా తయారు చేయడమే నా లక్ష్యం. మాకిచ్చిన మంత్రి పదవుల పట్ల మేము సంతోషంగా ఉన్నాం. ఐదేళ్లలో శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో నైపుణ్య గణన చేపడతాం. మానవ వనరులను మూలధన వనరులుగా మార్చి సంపద సృష్టిస్తాం. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే ఎజెండాగా ఎన్నికలకు వెళ్లి గెలిచామని' చంద్రబాబు నాయుడు అన్నారు. Also read: తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్ ములాఖాత్ #telugu-news #tdp #andhra-pradesh-news #chandra-babu-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి