Anushka Shetty : ప్రభాస్ ను రిజెక్ట్ చేసిన అనుష్క.. షాక్ లో ఫ్యాన్స్? అనుష్క ప్రభాస్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిందట. 'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ కి జోడీగా ముందు అనుష్కను తీసుకోవాలని అనుకున్నారట మేకర్స్. అయితే అనుష్క మాత్రం తాను ఆ పాత్రలో సెట్ అవ్వననే ఉద్ధేశ్యంతో ప్రభాస్ సినిమా నుంచి తప్పుకుందట. By Anil Kumar 25 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Anushka Shetty Rejects Prabhas : టాలీవుడ్ హీరోయిన్ (Tollywood Actress) అనుష్క శెట్టి (Anushka Shetty) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో చాల తక్కువ టైం లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో తన సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని అనుష్కకు కం బ్యాక్ ఇచ్చింది. ఈ మూవీ సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన స్వీటీ రీసెంట్ గా రెండు సినిమాలకు సైన్ చేసింది. కాగా 40 ఏళ్లకు పైగా వయసున్న అనుష్క ఇప్పటివరకు పెళ్లి జోలికి వెళ్లకుండా ఇంకా సింగిల్ లైఫ్ నే ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే ఈమె పెళ్ళికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) తో అనుష్క ప్రేమలో ఉందని, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, వీళ్ళ పెళ్ళికి కృష్ణంరాజు ఫ్యామిలీ కూడా ఓకే చెప్పినట్లు.. ఇలా ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అవన్నీ నిజం కాదని తేలిపోయింది. ఇదిలా ఉంటే అనుష్క ప్రభాస్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిందట. మ్యాటర్ ఏంటంటే, ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కి జోడీగా ముందు అనుష్కను తీసుకోవాలని అనుకున్నారట మేకర్స్. అయితే అనుష్క మాత్రం తాను ఆ పాత్రలో సెట్ అవ్వననే ఉద్ధేశ్యంతో ప్రభాస్ సినిమా నుంచి తప్పుకుందట. దాంతో అనుష్క ప్లేస్ లో కృతిసనన్ ని సెలెక్ట్ చేశారు. Also Read : జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్న.! సోషల్ మీడియాలో బుద్ధా పై ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ అభిమానులు! #prabhas #tollywood #anushka-shetty #anushka-shetty-marriage సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి