Britan: నిన్న బంగ్లా..నేడు బ్రిటన్‌..అసలేం జరుగుతుంది!

బంగ్లాదేశ్‌ తో పాటు బ్రిటన్‌ లో కూడా గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. సౌత్‌పోర్ట్‌లో ముగ్గురు బాలికలు మరణించిన తరువాత, వలసదారులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. జాత్యహంకారానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు బుధవారం ఇంగ్లాండ్ వీధుల్లోకి వచ్చారు.

New Update
Britan: నిన్న బంగ్లా..నేడు బ్రిటన్‌..అసలేం జరుగుతుంది!

Britan: బంగ్లాదేశ్‌ తో పాటు బ్రిటన్‌ లో కూడా గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సౌత్‌పోర్ట్‌లో ముగ్గురు బాలికలు మరణించిన తరువాత, వలసదారులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. జాత్యహంకారానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు బుధవారం ఇంగ్లాండ్ వీధుల్లోకి వచ్చారు. బుధవారం రాత్రి 11 గంటలకి బ్రిటన్‌ వీధుల్లో భారీ పోలీసు బలగాలను మోహరించాయి.

దాదాపు 100కంటే ఎక్కువ ప్రదర్శనలు బ్రిటన్‌ వీధుల్లో బుధవారం జరిగాయి. లండన్, బ్రిస్టల్, బ్రైటన్, బర్మింగ్‌హామ్, లివర్‌పూల్, హేస్టింగ్స్, వాల్తామ్‌స్టో వంటి నగరాలు, పట్టణాల వీధుల్లో పెద్ద సంఖ్యలో జాత్యహంకార వ్యతిరేక నిరసనకారులు గుమిగూడారు. జాత్యహంకార వ్యతిరేక నిరసనకారులు.. జాత్యహంకారాన్ని నాశనం చేయండి, శరణార్థులకు స్వాగతం అనే ప్లకార్డులను ప్రదర్శించారు.

జాత్యహంకార వ్యతిరేకుల సంఖ్య ఎంతగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో చాలా రోజులుగా ముస్లింలు , వలస వచ్చిన జనాభాను లక్ష్యంగా చేసుకుని నిరసనలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా పోలీసు అధికారులు చాలా మంది గాయపడ్డారు. చాలా షాపులు లూటీ అయ్యాయి. శరణార్థుల హోటళ్లపై దాడులు జరిగాయి. అల్లర్ల తర్వాత 100 మందికి పైగా అల్లర్లపై అభియోగాలు మోపారు. వారి కేసులు కోర్టు ప్రక్రియ ద్వారా వేగంగా ట్రాక్ చేయడం జరిగింది. బుధవారం ముగ్గురు వ్యక్తులను జైలుకు పంపారు. వారిలో ఒకరికి మూడేళ్ల శిక్ష పడినట్లు అధికారులు తెలిపారు.

Also read: కావాలనే తొక్కేశారు.. కానీ గెలుపు ఆమెదే.. వినేశ్ ఓ సంచలనం

Advertisment
Advertisment
తాజా కథనాలు