ముందు ఈ మూడింటికి సమాధానం చెప్పండి: అంబటి!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పలు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు వేశారు. చంద్రబాబు! పోలవరం వస్తున్నారు కాబట్టి నేను వేసిన మూడు ప్రశ్నలకు ఇప్పుడైనా సమాధానం ఇస్తారా? అని నిలదీశారు.

New Update
ముందు ఈ మూడింటికి సమాధానం చెప్పండి: అంబటి!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పలు ప్రశ్నలు సంధించారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు వేశారు. చంద్రబాబు! పోలవరం వస్తున్నారు కాబట్టి నేను వేసిన మూడు ప్రశ్నలకు ఇప్పుడైనా సమాధానం ఇస్తారా? అని నిలదీశారు.

పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. దీనిని కేంద్ర స్థాయిలో నిర్మాణం చేపట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని ఎందుకు అనుకున్నారు? కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రమ్‌ వాల్ ను ఎలా నిర్మించారు?

2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఎందుకు విఫలమయ్యారు? అంటూ మూడు ప్రశ్నలు వేశారు. ఈ మూడు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు అన్నారు.

ఇదిలా ఉంటే అంబటి రాంబాబు ప్రశ్నలకు నెటిజన్లు కూడా కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు సంగతి పక్కన పెడితే మీరేప్పుడు పోలవరం పూర్తి చేస్తారో చెప్పండి అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం పోలవరం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు, మంత్రులు చంద్రబాబు మీద విరుచుకుపడుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini Love: ఓరి మీ దుంపల్‌తెగ ఆపండ్రోయ్.. అఘోరీ కోసం వర్షిణీ లవ్ సాంగ్- వీడియో

శ్రీవర్షిణి కొన్ని పాటలను లేడీ అఘోరీకి డెడికేట్ చేసింది. మళ్లీ తాను అఘోరీ చెంతకు చేరుకున్న ఆనందంలో పాటలు పాడింది. మెల్లగ కరగనీ రెండు మనసుల దూరం అంటూ ప్రభాస్ వర్షం మూవీలోని సాంగ్‌ను పాడి అఘోరీకి డెడికేట్ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

New Update

అఘోరీ - శ్రీవర్షిణీ ఎపిసోడ్ మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఓ రేంజ్‌లో నడిచిన వీరి కథ.. ఇప్పుడు మరో మలుపు తిరిగింది. వీరిద్దరూ వీరి నాలుగు నెలల ప్రేమ బంధానికి గుర్తుగా పెళ్లి చేసుకున్నారు. అయితే అది ఒకసారి కాకపోవడం గమనార్హం. వేరు వేరు ప్రాంతాల్లో రెండు సార్లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మొదటి సారి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య వర్షిణీని అఘోరీ బంగారు చైన్‌ వేసి పెళ్లాడింది. ఈ విషయాలన్నీ స్వయంగా వర్షిణీనే బయటపెట్టింది. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అంతేకాకుండా ఇటీవలే గుజరాత్ నుంచి వచ్చి ఫ్యామిలీ దగ్గర ఉన్న వర్షిణీ ఇప్పుడు మళ్లీ అఘోరీ చెంతకు చేరుకుంది. తమను ఎవరూ విడదీయలేరని అంటోంది. తమ ప్రేమకు గుర్తుగా పెళ్లి కూడా చేసుకున్నామని చెబుతోంది. అఘోరీలో జెన్యుటీని చూసి ఇష్టపడ్డానని అంటోంది. అఘోరీతో సె**క్స్‌ను తాను కోరుకోలేదని.. సె**క్స్ కోరికలు తనకు లేవని తెలిపింది. ఇందులో భాగంగానే RTV ఛానెల్‌తో ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో అఘోరీపై ప్రేమను కురిపించింది. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

అఘోరీ కోసం స్పెషల్ సాంగ్ 

అఘోరీ అంటే తనకు ఎంత ఇష్టం..? ఎందుకు ఇష్టమో తెలిపింది. అంతేకాదండోయ్.. అఘోరీ కోసం ఏకంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ పాటలను డెడికేట్ చేసింది. అఘోరీ - వర్షిణీ ఇద్దరూ కారులో ఉండి లైవ్ ఇచ్చారు. అందులో అఘోరీ కోసం వర్షిణీ కొన్ని పాటలు పాడింది. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీలోని వీడు ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఓ సాంగ్ పాడింది. ఆ తర్వాత.. ప్రభాస్ ‘వర్షం’ మూవీలోని మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం అంటూ ఓ సాంగ్ పాడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

(aghori | lady aghori sri varshini relation | sri varshini | Aghori Sri Varshini Lov | aghori sri varshini | latest-telugu-news | telugu-news)

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment