Another Woman Killed in Elephant Attack: చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి..!

చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి మదపుటేనుగు దాడిలో మరో మహిళ మృతి చెందింది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు బోడి నత్తం గ్రామానికి చెందిన మహిళ వసంత(57) అనే మహిళ ఏనుగు దాడిలో మృతి చెందింది. గురువారం తెల్లవారు జామున వసంత అనే మహిళపై దాడి చేసి చంపేసింది. శ్రీరంగం పల్లి చెరువు నుంచి కుంకి ఏనుగుల ద్వారా అటవీ ప్రాంతంలోకి అధికారులు మళ్లీస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏనుగు వరుసగా దాడి చేస్తూండటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

New Update
Telangana: కొమురం భీం జిల్లాలో ఏనుగు భీభత్సం..ఇద్దరు రైతులు మృతి

Another Woman Killed in Elephant Attack at Chittoor in Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి మదపుటేనుగు దాడిలో మరో మహిళ మృతి చెందింది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు బోడి నత్తం గ్రామానికి చెందిన మహిళ వసంత(57) అనే మహిళ ఏనుగు దాడిలో మృతి చెందింది. గురువారం తెల్లవారు జామున వసంత అనే మహిళపై దాడి చేసి చంపేసింది. శ్రీరంగం పల్లి చెరువు నుంచి కుంకి ఏనుగుల ద్వారా అటవీ ప్రాంతంలోకి అధికారులు మళ్లీస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏనుగు వరుసగా దాడి చేస్తూండటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగు ఆపరేషన్ లో భాగంగా ముగ్గురు వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. ట్రాక్టర్ల పై కూడా ఏనుగు దాడికి దిగింది. ఏనుగు దాడులతో అటవీ శాఖ అధికారులను ఆందోళనలకు గురిచేస్తోంది.

ఏనుగు దాడిలో దంపతులు మృతి, యువకుడి పరిస్థితి విషమం:

బుధవారం జిల్లాలోని గుడిపాల మండలంలోని 190 రామాపురం గ్రామంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఓ ఏనుగు గ్రామ సమీపంలోని పొలాలపై పడింది. రామాపురం గ్రామంలోని పొలంలో పనిచేస్తున్న వెంకటేష్ (50), సెల్వి(40) దంపతులపై ఏనుగు దాడి చేయడంతో.. వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సీకే పల్లె లో మామిడి తోటలో కార్తీక్(24) అనే యువకుడి ​పై ఏనుగు దాడి చేయగా.. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కార్తీక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

అటవీ ప్రాంతంలోకి తరిమేయడానికి ప్రయత్నిస్తున్న అధికారులు:

ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతంలోకి తరిమేయడానికి అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయి. వీటిని అరికట్టడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

భయాందోళనలో ప్రజలు:

ఏనుగుల గుంపు తరచూ పంటలపై దాడి చేస్తూనే ఉంటున్నాయని, అక్కడి పల్లె జనాలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. అడ్డుకోవడానికి వచ్చిన వారిపై తీవ్రంగా విరుచుకు పడుతున్నాయని వాపోతున్నారు. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే జాగ్రత్త!!

Srisailam: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల్లో నష్టం

Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన.. సెప్టెంబర్ లో భారీ వర్షాలు!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment