America: అమెరికాలో మరో వింత వ్యాధి...హడలి పోతున్న ప్రజలు!

అమెరికాలో మరో వింత వ్యాధి ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. న్యూ హాంప్‌షైర్‌ లో దోమల వల్ల వచ్చే అరుదైన వ్యాధి ని ఈస్టర్న్‌ ఈక్విన్‌ ఎన్సెఫాలిటిస్ వైరస్ అంటారని నిపుణులు తెలియజేశారు. దీని వల్ల ఇప్పటికే ఓ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు నిర్థారించారు.

New Update
America: అమెరికాలో మరో వింత వ్యాధి...హడలి పోతున్న ప్రజలు!

America: అమెరికాలో మరో వింత వ్యాధి హడలెత్తిస్తుంది. న్యూ హాంప్‌షైర్‌ లో దోమల వల్ల వచ్చే అరుదైన వ్యాధితో ఓ వ్యక్తి చనిపోయాడు. దీనిని ఈస్టర్న్‌ ఈక్విన్‌ ఎన్సెఫాలిటిస్ వైరస్ అంటారని నిపుణులు తెలియజేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఆరోగ్య అధికారులు దీని గురించి మాట్లాడుతూ.. హెంప్‌స్టెడ్ నగరానికి చెందిన వయోజన వ్యక్తిగా గుర్తించిన రోగి కేంద్ర నాడీ వ్యవస్థ రుగ్మతతో ఆసుపత్రిలో చేరాడు. అతను వ్యాధికి చికిత్స తీసుకుంటుండగా మృతి చెందాడు.

2014 సంవత్సరం ప్రారంభంలో న్యూ హాంప్‌షైర్‌లో 3 ఈఈఈవీ కేసులు మూడు కనుగొనగా అందులో ఇద్దరు మరణించారు. వాతావరణ మార్పుల కారణంగా దీని వ్యాప్తి ప్రమాదం పెరుగుతుందని నమ్ముతారు. ఆగస్టు ప్రారంభంలో మసాచుసెట్స్ 80 ఏళ్ల వ్యక్తిలో ఈఈఈ వైరస్‌ని నిర్ధారించింది. ఇది ఈ సంవత్సరం మొదటి కేసు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, పబ్లిక్ పార్కులను మూసివేసి దోమల నివారణకు మందులు పిచికారీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఈఈఈ వైరస్ సోకిన వ్యక్తికి జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మూర్ఛలు, ప్రవర్తనలో మార్పులు వంటి అనేక లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ మెదడు, వెన్నుపాము చుట్టూ మంట వంటి తీవ్రమైన నాడీ సంబంధిత వ్యాధులను కలిగిస్తుంది. వీటిని ఎన్సెఫాలిటిస్, మెనింజైటిస్ అని పిలుస్తారు.

Also Read: ట్రిపుల్‌ ఐటీ లో వెయ్యి మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత!

Advertisment
Advertisment
తాజా కథనాలు