Kannappa : 'కన్నప్ప' లో మరో స్టార్ హీరోయిన్?

ఇప్పుడు కన్నప్ప లో మరో స్టార్ హీరోయిన్ కూడా యాడ్ అయింది. మూవీలో కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

New Update
Kannappa : 'కన్నప్ప' లో మరో స్టార్ హీరోయిన్?

Kajal Agarwal In Kannappa Movie : మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa) షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. రీసెంట్ గానే విదేశాల్లో బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇండియన్ టాప్ సెలెబ్రిటీస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఎక్కడా తగ్గడం లేదు.

టెక్నీకాలిటీ దగ్గర్నుంచి కాస్టింగ్ వరకు అన్నీ టాప్ లెవెల్ లో ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమా కోసం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్ తో పాటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంటి స్టార్స్ ని దించాడు.

Also Read : ‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ప్రోమో తోనే గూస్ బంప్స్ తెప్పించిన అనిరుద్!

రీసెంట్ గానే ప్రభాస్ కన్నప్ప షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రభాస్ సెట్స్ లో అడుగుపెట్టినట్లు హీరో మంచు విష్ణు తన సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించారు. ఇక ఇప్పుడు కన్నప్ప లో మరో స్టార్ హీరోయిన్ కూడా యాడ్ అయింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు.

కన్నప్పలో కాజల్ అగర్వాల్

'కన్నప్ప' మూవీలో కాజల్ అగర్వాల్(Kajal Agarwal) ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ‘మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో టాలెంటెడ్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన సినిమాటిక్‌ అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది. కాగా ఈ సినిమాలో కాజల్ సైతం నటిస్తుండటంతో సినిమాలో ఆమె పోషించే పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కన్నప్ప లో కాజల్ ఎలాంటి రోల్ చేస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు