Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' లో మరో స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగే!

'కల్కి'లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భాగం అవుతున్నారట. 'సినిమాలో ప్రభాస్ ఎంట్రీ కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తాజా సమాచారం. ఇందుకోసం నాగ్ అశ్విన్ ఇప్పటికే మహేష్ ని కలిసినట్లు చెబుతున్నారు.

New Update
Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' లో మరో స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగే!

Mahesh Babu In Prabhas Kalki 2898AD : ప్రభాస్(Prabhas) - నాగ్ అశ్విన్(Nag Ashwin) కాంబినేషన్లో 'కల్కి 2898AD' మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ భాగం అవుతున్నారు. ప్రభాస్ తో పాటూ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. మళయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, న్యాచురల్ స్టార్ నాని, నాగార్జున గెస్ట్ రోల్స్ చేయనున్నారు. ఇక ఈ లిస్ట్ లో తాజాగా మరో స్టార్ హీరో కూడా చేరిపోయాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు?

'కల్కి' లో మహేష్ బాబు

'కల్కి' మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఈ సినిమాలో టాలీవుడ్(Tollywood) సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భాగం అవుతున్నారట. కాకపోతే సినిమాలో ఆయన కనిపించడు కానీ వినిపిస్తాడు.. సినిమాలో ప్రభాస్ విష్ణుమూర్తి అవతారంలో కనిపిస్తాడట. ప్రభాస్ పోషించే ఈ పాత్రను పరిచయం చేసేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహేష్ ని తీసుకొస్తున్నారట.

Also Read : తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి.. ఎప్పుడో చెప్పేసిన ‘దేవర’ బ్యూటీ!

'కల్కి' లో ప్రభాస్ ఎంట్రీ కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తాజా సమాచారం. ఇందుకోసం నాగ్ అశ్విన్ ఇప్పటికే మహేష్ ని కలిసినట్లు చెబుతున్నారు. గతంలో కొన్ని సినిమాలకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ప్రభాస్ 'కల్కి' సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు