Yashasvi Jaiswal : కుర్రాడు కుమ్మేశాడు.. వరుస టెస్టుల్లో రికార్డు డబుల్ సెంచరీ

యశస్వి జైస్వాల్ మూడో టెస్టులో మరో డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు. 214 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో వరుస మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు కొట్టిన వసీం అక్రమ్ రికార్డును సమం చేశాడు.

New Update
Yashasvi Jaiswal : కుర్రాడు కుమ్మేశాడు.. వరుస టెస్టుల్లో రికార్డు డబుల్ సెంచరీ

IND vs ENG : ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) అదరగొట్టేశాడు. ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్న ఈ యంగ్ ప్లేయర్ వరుస డబుల్(Double century) సెంచరీతో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి 214 : 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లతో రికార్డ్ ద్విశతకం బాదేశాడు. టెస్ట్ కెరీర్‌లో ఆడిన 7 టెస్టుల్లోనే జైస్వాల్ రెండు సార్లు డబుల్ సెంచరీ చేయడం విశేషం. కాగా టెస్టు క్రికెట్‌లో వరుస మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.

Also Read : మూడో టెస్ట్ నుంచి వైదొలగిన అశ్విన్‌.. కారణం ఇదే..

వన్డే తరహాలో బ్యాటింగ్..
ఓవర్‌నైట్ స్కోర్ 196/2తో రెండో ఇన్నింగ్స్‌ నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్‌(India) కు శుభ్‌మన్ గిల్(Shubman Gill), కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) లు మంచి శుభారంభాన్నిచ్చారు. అయితే సెంచరీ కొడతాడనుకున్న శుభ్‌మన్ 91 పరుగుల వద్ద అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. అనంతరం మూడో రోజు ఆటలో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు వెళ్లిన యశస్వీ జైస్వాల్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ఆ కాసేపటికే 27 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్‌ను రెహాన్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 258 పరుగులకు టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం జత కట్టిన యువ బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వన్డే తరహాలో ధాటిగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశారు. సర్ఫరాజ్‌ ఖాన్ (68*) వరుస హాఫ్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు.

భారీ లక్ష్యం..
ఇక భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేయగా.. ఇంగ్లాండ్‌(England) ఎదుట 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 445 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 319 రన్స్‌కే ఆలౌటైంది. భారత్‌కు 126 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA-China: అమెరికా టారిఫ్ ఎఫెక్ట్.. ఎగుమతి సవాళ్లు ఎదుర్కొంటున్న చైనా

అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు ఉండటం వల్ల ఆ దేశ ఎగుమతి ఆధారిత వ్యవస్థ తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటోంది. అయితే ఈ టారిఫ్‌లు చైనా ఎగుమతులను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
China Exports

China Exports

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఇరు దేశాలు టారిఫ్‌లు పెంచడంలో వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు పెంచింది. మరోవైపు చైనా అమెరికాపై 125 శాతం పెంచింది.  చైనాపై ఎక్కువ సుంకాలు ఉండటం వల్ల ఆ దేశ ఎగుమతి ఆధారిత వ్యవస్థ తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటోంది. అయితే ఈ టారిఫ్‌లు చైనా ఎగుమతులను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.  
 
చైనా ఆర్థిక వ్యవస్థ చాలా ఏళ్లుగా ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. అయితే చైనాకు అతిపెద్ద మార్కెట్‌లో అమెరికానే కీలకం. 2024లో అమెరికాకు చైనా 440 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతులు చేసింది. ఇది ఆ దేశం మొత్తం ఎగుమతుల్లో చూసుకుంటే 14 శాతం, అలాగే జీడీపీలో 3 శాతం ఉంది. అయితే చైనా దిగుమతులను అరికట్టాలని అమెరికా ముందుగా 10 శాతం నుంచి ఇప్పుడు 145 శాతానికి సుంకాలు పెంచింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, మెషినరీతో పాటు వివిధ రకాల ఉత్పత్తులను టార్గెట్ చేసింది.  
 
టారిఫ్‌ల ప్రభావం వల్ల చైనా వస్తువులకు అమెరికాలో డిమాండ్‌ గణనీయంగా పడిపోయింది. దీనివల్ల వచ్చే రెండేళ్లలో అమెరికాకు చైనా ఎగుమతులు 80 శాతం వరకు పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహణకు చూసుకుంటే చైనా నుంచి అమెరికా దిగుమతుల్లో 9 శాతం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ వంటి ఉత్పత్తులు తీవ్రంగా ధరల పెరుగుదలను ఎదుర్కొంటాయి.  దీనివల్ల వాటిని మార్కెట్ నుంచే బహిష్కరించే ఛాన్స్ ఉంటుంది. అలాగే లక్షలాది మంది కార్మికుల జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుంది. చైనాలో దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు అమెరికా సంబంధిత ఎగుమతులపైనే ఆధాపడి ఉన్నాయి. 

Also Read: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు

అమెరికా అధిక సుంకాల వల్ల చైనాలో పలు సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపివేశాయి. టెక్స్‌టైల్ కంపెనీలు అమెరికాకు పూర్తిగా తమ ఎగుమతులు నిలిపివేస్తున్నట్లు చెప్పాయి. ఈ టారిఫ్‌ల వల్ల తమ లాభాలు గణనీయంగా క్షీణించాయని వాపోతున్నాయి. తగ్గినటువంటి ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా ఉన్న తయారీ రంగాన్ని చాలా బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తల వల్ల పారిశ్రామికోత్పత్తి కుదేలు కాగా.. మళ్లీ మరింత ఒత్తిడిని ఎదుర్కోనుంది.  

అమెరికా సుంకాలను పెంచడం, అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం వంటి కారణాల వల్ల గోల్డ్‌మన్‌ శాక్స్‌ 2025లో చైనా జీడీపీ వృద్ధిని 4 శాతానికి సవరించింది. చైనా జీడీపీలో అమెరికాకు చేసే ఎగుమతుల వాటే తక్కువగా ఉన్నప్పటికీ.. తగ్గిన పెట్టుబడులు, వినియోగదారుల సామర్థ్యం వల్ల మరింత ఆర్థిక ఒత్తిడి ఎదురుకానుంది. 

అయితే అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించేందుకు చైనా మరో మార్గాలను అనుసరిస్తోంది. ఆగ్నేసియా ప్రాంతాల వైపు తమ ఎగుమతులు చేసి అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. 2019 నుంచి ఆగ్నేసియాలో చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తాజా సుంకాల వల్ల వాణిజ్య పరిణామాలు మారుతున్నాయి. ఉదాహరణకు టెక్స్‌టైల్ సంస్థలు తక్కవ వాణిజ్య అవరోధాలు ఉండే మార్కెట్లకే తమ ఎగుమతులు చేస్తున్నాయి. కానీ ఆ మార్కెట్లు తరచుగా తక్కువ మార్జిన్లు అందిస్తాయి. 

Also Read: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

ఇదిలాఉండగా అమెరికా వస్తువులపై చైనా 125 శాతానికి సుంకాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఇది సోయాబీన్స్, పంది మాసం వంటి వాటితో సహా ఇంధనాలు, యంత్రాలను లక్ష్యంగా చేసుకుంది. అమెరికా ఉత్పత్తిదారులపై ఒత్తిడి తీసుకురావాలనే చైనా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక చైనా మినహా మిగతా దేశాలపై అమెరికా 90 రోజుల పాటు టారిఫ్‌లను నిలిపివేసిన సంగతి తెలిసిందే.  

telugu-news | rtv-news | US tariffs 

Advertisment
Advertisment
Advertisment