Chandrababu Naidu: ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే ..వారికి అదే చివరి రోజు: చంద్రబాబు!

ఆడ బిడ్డల జోలికి వస్తే..అదే వారికి చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్ధం కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం తప్పు చేసేవారిలో కనిపించేలా పోలీసు శాఖ పని చేయాలన్నారు.

New Update
Press Meet : గెలుపు తరువాత చంద్రబాబు సంచలన ప్రెస్ మీట్

Chandrababu Naidu: మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలని, ఆడ బిడ్డల జోలికి వస్తే ..అదే వారికి చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్ధం కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలని, నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం తప్పు చేసేవారిలో కనిపించేలా పోలీసు శాఖ పని చేయాలని అన్నారు. నేరం జరిగిన తర్వాత నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒక ఎత్తు అయితే ..అసలు నేరం చేయాలంటేనే భయపడే స్థితి కల్పించాలన్నారు.

వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బుధవారం హోంశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి వంగల పూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలకు భద్రత విషయంలో గట్టి భరోసా ఇచ్చేలా పోలీసు శాఖ పనితీరు ఉండాలని, పూర్తి స్థాయి శాంతి భద్రతలతో ప్రశాంతమైన రాష్ట్రంగా ఏపీ అభివృద్ది చెందాలని బాబు అన్నారు.

రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు అన్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్తులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పని చేయాలని చంద్రబాబు అన్నారు.

Also Read: జేఎంఎంలో అవమానాలు..అందుకే కొత్త పార్టీ: చంపయీ సోరెన్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Posani Krishna Murali: పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?

పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో పోసాని మళ్లీ అరెస్ట్ అవుతారన్న చర్చ మొదలైంది.

New Update

సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ పోలీసులు మరో బిగ్‌ షాక్‌ ఇచ్చారు. తాజాగా పోసానిపై మరో కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో సుళ్లూరుపేట పీఎస్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు రావాలని పోలీసులు పోసానిని ఆదేశించారు. నిన్న సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్తున్న సమయంలో ఈ నోటీసులు అందించారు. పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే కపలు కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఫిబ్రవరిలో అరెస్ట్..

చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ అభియోగాలతో ఫిబ్రవరి 26న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబులవారిపల్లో పోలీసులు హైదరాబాద్ లోని పోసాని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 16 కేసులు ఆయనపై నమోదయ్యాయి. సీఐడీ కూడా ఆయనను అదుపులోకి తీసుకుని విచారించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో మార్చి 22న పోసాని గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. కానీ నో రిలీజ్

నెల రోజులకు పైగా జైల్లో..

దాదాపు నెల రోజులకు పైగా ఆయన ఈ కేసుల్లో జైల్లో ఉన్నారు. కేసు గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడవద్దని.. రూ.2 లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలని బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు పోసానికి స్పష్టం చేసింది. నాలుగు వారాల పాటు ప్రతీ మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపు మంగళగిరి లోని ఏపీ సీఐడీ ఆఫీసుకు వచ్చి సంతకం చేయాలని స్పష్టం చేసింది. 

(posani krishna murali arrest | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment