/rtv/media/media_files/2024/10/23/5BMu3serlQvJ3P42YW5q.jpg)
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై అధికారం కోల్పోయిన వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై కూడా కూటమి ప్రభుత్వం వైసీపీకి తీవ్ర ఆరోపణలు చేసింది. మరోవైపు ఆ పార్టీకి చెందిన నేతలు విజయసాయి రెడ్డి, కుక్కల విద్యాసాగర్‌ల వ్యవహారం కూడా తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. కూటమి ప్రభుత్వంపై గట్టిగా విమర్శలు చేసేందుకు ఇంతవరకు వైసీపీకి సరైన అంశం దొరకలేదు. అయితే తాజాగా వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సంచలన పోస్టు చేసింది.
Also Read: లోకేష్.. అందుకే నిన్ను పప్పు అనేది: జగన్ సెటైర్లు
'ట్రూత్ బాంబ్ కోసం సిద్ధంగా ఉండండి. అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు దాన్ని పడేయబోతున్నాం. వేచి ఉండండి' అంటూ ట్వీట్ చేసింది. దీనికి 'ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్' అనే పోస్టర్‌ను జతచేసి పోస్ట్ చేసింది. దీంతో వైసీపీ ఏ వ్యవహారాన్ని బయటబెట్టపోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. ఏదో పెద్ద స్కామ్‌ను బయటబెట్టబోతున్నారని నెటిజన్లు స్పందిస్తున్నారు.
Get ready for the truth bomb 💣 Dropping on 24th Oct at 12 PM!
— YSR Congress Party (@YSRCParty) October 23, 2024
Stay tuned ❗#BigExpose pic.twitter.com/IxkzYt2N4x
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ స్కామ్‌ను బయటకు తీసి అప్పటి విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్‌లోనే ఉంది. ఈ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన చంద్రాబాబు.. ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీలతో జతకట్టి అధికారంలోకి వచ్చి మళ్లీ సీఎం అయ్యారు. మరీ ఇప్పుడు వైసీపీ ఓ పెద్ద వ్యవహారాన్ని బయటబెట్టబోతున్నామని ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. చంద్రబాబును టార్గెట్ చేశారా ? లేదా పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు ? లేదా రెండు పార్టీలపై పెద్ద ఎత్తున ఏదైనా అంశాన్ని బయటపెడతారా అనేది దానిపై రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
Also Read: వైసీపీకి కీలక నేత రాజీనామా!
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
గడచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని కల్లారా చూసామని, ఆ విధ్వంసం నుంచి కోలు కోవడానికి చాలా కష్టపడాలి. జగన్ పార్టీ నేరాలు హత్యలు అవినీతి అరాచకం అణచివేత మీద నిర్మించ బడిందని ఏపీ మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
AB Venkateswara Rao
AB Venkateswara Rao :గడచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని కల్లారా చూసామని, ఆ విధ్వంసం నుంచి కోలు కోవడానికి చాలా కష్టపడాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీ నేరాలు హత్యలు అవినీతి అరాచకం అణచివేత కులాల మీద నిర్మించ బడిందని ఏపీ మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రానికి ,ఆంధ్ర సమాజానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం..పెద్ద ఉపద్రవం వైయస్ జగన్, ఆయన వైయస్సార్ పార్టీ అన్నారు. సమాజానికి పెద్ద ప్రమాదం వైఎస్ జగన్ అని, ఆయన పాలనలో వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి, ప్రజాస్వామ్య విలువలు విధ్వంసం అయ్యాయన్నారు.
Also read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నా వంతు నేను పని చేస్తానని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాకు వద్దు అని ప్రజలు నిశ్చయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు..బలహీనులు,బాధితులకి సాయం చేయడం కోసం వాళ్లకి అండగా ఉండడం కోసం అలాగే అన్యాయాలు జరిగితే ఎదురు నిలవడం కోసం తప్పులు సరిదిద్దడానికి ప్రజల ఆలోచనలను నాకు జ్ఞానం ఉన్నంతవరకు అవగాహన చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని స్పష్టం చేశారు.
Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
నా దృష్టిలో రాజకీయాలంటే సమాజ స్థితిగతుల్ని అవగాహన చేసుకుని జరిగినటువంటి తప్పులను సవరించుకొని తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడుతూ ఒక మెరుగైన భవిష్యత్తు కోసం సమాజాన్ని నడిపించడంలో చురుకైన పాత్ర పోషించడమే అన్నారు.రాజకీయాలంటే పదవి, అధికారము రాజకీయం కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో రాజకీయాలంటే అరాచకం అడ్డొచ్చిన వాళ్ళని అణిచివేయడం అని వెల్లడించారు.ప్రజల్ని కులాలు ,మతాలు, ప్రాంతాలు వర్గాలుగా విడదీసి ఒకళ్ళ మీద ఒకరు ఎగదోసి ఆ సందర్భంలో తన దోపిడీని కొనసాగించుకోవచ్చని మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని త్వరలో రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.
Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ
Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ
DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం.. మంబయి స్కోర్ ఎంతంటే ?
Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం
Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ
KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Cricket Betting : క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలి