/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/speaker-jpg.webp)
Tammineni: వైసీపీ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జనసేనలోకి వెళ్తారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ అధిష్టానం తీరుపై తమ్మినేని సీతారాం అసంతృప్తిగా ఉన్నారని.. అధిష్టానం నిర్ణయాలపై గుర్రుగా ఉంటున్నారంటూ టాక్ నడుస్తుంది. ఈ ప్రచారంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవటంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం స్పందించారు.
Also Read: Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్.. 'డాకు మహారాజ్' నుంచి మాస్ సాంగ్
జనసేన పార్టీలోకి తమ్మినేని సీతారాం వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించిన తమ్మినేని సీతారాం.. జనసేనలోకి వెళ్లాల్సిన అవసరం తనకేమిటని అన్నారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Mann ki Baat: మన్‌కీ బాత్‌లో ఏఎన్నార్ ప్రస్తావన.. ఎన్టీఆర్‌ను మర్చిపోయిన మోదీ
తన కుమారుణ్ని ఇటీవల ఆస్పత్రిలో చేర్పించానని.. గత 15 రోజులుగా ఆసుపత్రి దగ్గరే ఉన్నానని తమ్మినేని సీతారాం వెల్లడించారు.
అందుకే పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేకపోయానని చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులుగా నియమించారు.
Also Read: Year Ender 2024: దేశాన్ని ముంచేసిన విషాదాలు ఇవే.. 2024 ఓ చేదు జ్ఞాపకం!
ఇదే సమయంలో తమ్మినేని సొంత నియోజకవర్గం ఆముదాలవలసకి కొత్త ఇన్‌చార్జిని ఏర్పాటు చేశారు. ఆముదాలవలస వైసీపీ ఇంఛార్జిగా చింతాడ రవికుమార్‌ను జగన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే
దాంతో జగన్ నిర్ణయంతో తమ్మినేని అసంతృప్తికి గురయ్యారని.. జనసేనలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తమ్మినేని సీతారాం ఈ విషయం పై క్లారిటీ ఇచ్చేశారు.
Also Read: Bullet Train: చైనా మరో అద్భుతం.. గంటకు 450 కి.మీ ప్రయాణించగల రైలు ఆవిష్కరణ
.