షర్మిలకు జగన్ అన్యాయం.. విజయమ్మ సంచలన లేఖ!

వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం అనంతరం తాజాగా వైఎస్ విజయమ్మ ఎమోషనల్ లేఖ రాశారు. ‘‘ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాదేస్తుంది. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. జరగకూడనివన్నీ నా కళ్ళముందే జరిగి పోతున్నాయి’’ అన్నారు.

New Update
ys family

గత కొద్ది రోజులుగా వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి, షర్మిల మధ్య ఆస్తి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్ అయింది. తాజాగా ఈ ఆస్తుల వివాదంపై వై.ఎస్‌.సతీమణి విజయమ్మ స్పందించారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు తనను చాలా చాలా బాధిస్తున్నాయి అని ఎమోషనల్ అయ్యారు. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో తనకు అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని తన కళ్ళముందే జరిగి పోతున్నాయన్నారు. 

Also Read :  దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?

ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు

తన ఫ్యామిలీ గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారన్నారు. అబద్దాల పరంపర కొనసాగుతుందని.. తెలిసి కొంత తెలియకుండా కొంత మాట్లాడుతున్నారని అన్నారు. అందువల్ల ఇతరులు తమ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవద్దని విజయమ్మ కోరారు. అన్న, చెల్లి ఇద్దరు అంగీకారానికి వస్తారని.. వాళ్లను రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు మండిపడ్డారు. 

Also Read :  10 నిమిషాల రన్నింగ్‌తో ఆ ప్రమాదకరమైన వ్యాధులు దూరం

విజయసాయి, సుబ్బారెడ్డికి అన్నీ తెలుసు

వై.ఎస్ ఉండగా ఆస్తుల పంపకం జరగలేదన్నారు. వాళ్లిద్దరూ పిల్లలుగా ఉన్న రోజుల్లో కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద, మరికొన్ని షర్మిల పేరు మీద రాశారని తెలిపారు. విజయసాయి, సుబ్బారెడ్డికి అన్నీ తెలుసన్నారు. ఒక అమ్మగా తనకు
ఇద్దరు సమానమేనని పేర్కొన్నారు.

Also Read :  KTR, హరీష్ మధ్య కొట్లాట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్తులను పెంచడంలో జగన్ కష్టం ఉంది

ఆస్తుల్లో భాగం కూడా ఇద్దరికి సమానమేనని ఆ లేఖలో రాసుకొచ్చారు. అంతేకాకుండా నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు ఆస్తి సమానంగా ఉండాలనేది వైఎస్ కోరిక అని విజయమ్మ అన్నారు. ఆస్తులను పెంచడంలో జగన్ కష్టం ఉందని.. కానీ అవన్ని కుటుంబ ఆస్తులేనని చెప్పుకొచ్చారు. జగన్ గెలిచిన రెండు నెలలకు ఆస్తులు పంచుకుందామని నిర్ణయించారని అన్నారు.

Also Read :  చంపేస్తామంటూ.. బాబా సిద్దిఖీ కుమారుడికి బెదిరింపులు

బిడ్డకు అన్యాయం చేస్తుంటే తట్టుకోలేను

ఆ తర్వాత విజయవాడలో 2019లో MOU రాశారని.. అది జగన్ స్వతహాగా రాసి ఇచ్చిన MOUనే అని విజయమ్మ పేర్కొన్నారు. షర్మిలకు హక్కు ఉంది కాబట్టే 200 కోట్ల డివిడెండ్లు ఉన్నాయని తెలిపారు. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే తట్టుకోలేను అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ కోసం షర్మిల ఎంతగానో చేసిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడీ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు