YS jagan: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత : వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ YSRCP పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమైయ్యారు. తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైస్ జగన్ మాట్లాడారు. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు.

author-image
By K Mohan
New Update
YS Jagan

ఆంధ్రప్రదేశ్ YSRCP పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో గురువారం సమావేశమైయ్యారు. తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైస్ జగన్ మాట్లాడారు. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు.

Also Read: ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ కేసు పిటిషన్ కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నేతలు అసత్య హామీలు ఇచ్చారని మండిపడ్డారు. అన్ని నియోజకవర్గాల ప్రజలతో మమేకమౌతామని వైఎస్ జగన్ అన్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల తరుపున నిలబడాల్సిన సమయం వచ్చిందని పార్టీ కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు.

Also reda : పుష్ప అంతా ఫేక్.. నేనూ ఎర్రచందనం వ్యాపారినే: రాకేష్ రెడ్డి

మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు కళావతి, రెడ్డిశాంతి, ఎంపీపీలు జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, భవిష్యత్ కార్యచరణపై శ్రీకాకుళం జిల్లా నాయకులతో చర్చించారు. వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

Also read: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్‌ కంపెనీ..


Also Read: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: 45 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

TTD 45రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో మే1 - జూన్ 15 వరకు ఎమ్మెల్యే,ఎంపీ, ప్రముఖుల సిఫార్సులపై జారీచేసే బ్రేక్ దర్శనాలను క్యాన్సిల్ చేసింది. ప్రొటోకాల్ పరిధి ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది.

New Update
TTD cancels VIP break darshans for 45 days

TTD cancels VIP break darshans for 45 days

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులు ప్రారంభం అయ్యియి. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

మే1 నుంచి రద్దు

ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అదే సమయంలో కేవలం ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

ఒక్కరోజే 82,811 మంది భక్తులు

ఇదిలా ఉంటే TTDలో టోకెన్లు లేని భక్తులకు దాదాపు 18 గంటల సమయం పైనే పడుతోంది. కేవలం ఒక్క శనివారం రోజే భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సుమారు 82,811 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 34,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కేవలం ఆ ఒక్క రోజే రూ.3.24 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్

telugu-news | ttd | latest-telugu-news | tirumala tirupati temple

Advertisment
Advertisment
Advertisment