volunteers: 250 మంది వాలంటీర్ల రాజీనామా..!
ఏపీలో పలుచోట్ల వాలంటీర్లు వరుసగా రాజీనామాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, విశాఖ జిల్లా పాడేరులో 250 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు.
ఏపీలో పలుచోట్ల వాలంటీర్లు వరుసగా రాజీనామాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, విశాఖ జిల్లా పాడేరులో 250 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు.
కూటమి తరఫున అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ మెగాస్టార్ చిరంజీవిని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమేష్ కు చిరంజీవి ఆయనకు తన మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయండి.. మీ వెంట నేనున్నాని భరోసానిచ్చారు.
ఏపీలో నేతలపై రాళ్ల దాడుల ఘటనలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ సభలో చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరి పరారు అయ్యాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సీఎం జగన్ పై దాడి జరిగిందో లేక జరిపించుకున్నారో ఎవరికి తెలుసని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. గతంలో కోడి కత్తి దాడి కూడా ఎన్నికల సమయంలో జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై విచారణ జరిగిన తర్వాతే మాట్లాడుతానని అన్నారు.
AP: చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరకు కూటమి నేతలు వ్యతిరేకమని చంద్రబాబుకు చెప్పగలరా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలని సవాల్ చేశారు.
విశాఖ గాజువాకలో అదానీ గంగవరం పోర్టు కాంట్రాక్ట్ కార్మికులు నిరసన చేపట్టారు. మూడు రోజుల నుంచి విధులు బహిష్కరించి పోర్ట్ లో ఆందోళన చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
శాఖపట్నం అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కసింకోట మండలం బయ్యవరం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ టిఫిన్ వాహనంపైకి ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో దారుణం చోటుచేసుకుంది. లారీ బైకును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. దుప్పుతూరి నుంచి అచ్యుతాపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధువులు ధర్నా చేపట్టారు.