/rtv/media/media_files/2025/02/18/nsCBDqOllvbN9KouKeE0.jpg)
Vizag Lorry Incident
Vizag Lorry Incident: విశాఖపట్నం బీచ్ రోడ్డులో లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం నోవాటెల్ హోటల్ డౌన్లో ఇసుక లోడ్ తో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో.. పక్కనే ఉన్న పార్కులోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి అపాయం జరగకపోవడంతో స్థానికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
వైజాక్ లారీ వీడియో
విశాఖ బీచ్ రోడ్డులో మంగళవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది.
— RTV (@RTVnewsnetwork) February 18, 2025
నోవాటెల్ హోటల్ డౌన్లో ఇసుక లోడుతో వస్తున్న భారీ లారీ బ్రేకులు ఫెయిలై గోడ ఢీకొట్టుకుంటూ పార్క్ లోకి వెళ్లింది.
లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
పరిమితికి మించి ఇసుక… pic.twitter.com/nZNkm2eErp
Also Read: విశాఖలో లారీ భీభత్సము.. పార్కులోకి దూసుకెళ్లడంతో..
అలాగే రెప్పపాటు క్షణంలో ఓ కారు, బైకు పై వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదం తప్పించుకున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. కారు, బైక్ లారీ కింద పడి నుజ్జు నుజ్జు అయిపోయేవి. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పరిమితికి మించి ఇసుక లోడ్ ఉండడంతో డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. లారీ ముందు భాగం మొత్తం డ్యామేజ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: మెదక్ జిల్లాలో దారుణం .. తల్లి అక్రమసంబంధం కొడుకులకు తెలియడంతో
A #truck lost control due to brake failure and crashed into a children's park on RK Beach road in #Visakhapatnam on Tuesday
— TNIE Andhra Pradesh (@xpressandhra) February 18, 2025
📸: @Gsn_tnie @NewIndianXpress @santwana99 @BSNMalleswarRao pic.twitter.com/9QzaSb2gB1
Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్