జాతీయ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు-LIVE
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
జనాలు కొట్టిన స్లిప్పర్ షాట్ నుంచి కోలుకోవడానికి కొంత టైం పడుతుంది చిల్ బ్రో అంటూ జగన్‌పై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. బాబాయ్ ను లేపేసింది ఎవరో చెప్పే దమ్ముందా జగన్ అంటూ సవాల్ విసిరారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ పంథా మార్చుకోవాలని సూచించారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో 26వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతి పత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాను.
ఏపీ హైకోర్టులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరిన వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.
AP: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరో షాక్ తగిలింది. చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో ఆయనకు నోటీసులు అందాయి. ఈరోజు విచారణకు తమ కార్యాలయం ఎదుట హాజరు కావాలని మంగళగిరి డీఎస్పీ నోటీసులు జారీ చేశారు.
ఏపీ లోని పేద ప్రజలకు పండుగల సమయంలో ఇచ్చే చంద్రన్న కానుకను మరోసారి రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కూటమి సర్కార్ రెడీ అవుతోంది. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా ను మరోసారి అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలను ఆపింది.
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. కోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ అయిన జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ ను... ఏసీబీ కోర్టు లో ఈరోజు అధికారులు హాజరుపరిచారు. ఈ కేసులో ఇరు వర్గాల తరఫున వాదనలు విన్న న్యాయమూర్తి..ఈ నెల 23వ తేదీ వరకు ఇద్దరికీ జ్యూడీషియల్ రిమాండ్ విధించారు.