విజయవాడ లోకో పైలట్‌ను అందుకే చంపేశా.. విచారణలో షాకింగ్ నిజాలు! దక్షిణమధ్య రైల్వేలో లోకో పైలట్ డి.ఎబినేజర్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బిహార్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించారు. వ్యసనాలకు బానిసవడంతో డబ్బుకోసం బెదిరించేవాడు. ఎబినేజర్‌ని కూడా డబ్బులు అడగ్గా లేవనడంతో కొట్టి చంపేశాడు. By Seetha Ram 12 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి పని చేసుకునేందుకు తమ రాష్ట్రం వదిలి వేరొక రాష్ట్రానికి వచ్చాడు. డబ్బులు సంపాదించుకోవాలనుకున్నాడు.. కానీ వ్యసనాలకు బానిసయ్యాడు. పని చేసుకోలేక ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. రాత్రి సమయంలో ఒంటరిగా వచ్చిన వారిని బెదిరించి డబ్బులు గుంజుకున్నాడు. కాదు కూడదని ఎదురుతిరిగిన వారిపై దాడి చేశాడు. డబ్బుల కోసమే హత్య అలా దాడి చేసి ఓ ప్రభుత్వ ఉద్యోగిని చంపేశాడు. ఆపై పరారయ్యాడు. ఈ ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరగగా.. ఆ నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్ సెంట్రల్ రైల్వేలో డి.ఎబినేజర్ అనే వ్యక్తి లోకో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సెప్టెంబర్ 10న విజయవాడ రైల్వే స్టేషన్ ఎఫ్ క్యాబిన్ వద్ద ఎబినేజర్ ఉన్నాడు. అదే సమయంలో బీహార్‌కు చెందిన దేవ్ కుమార్ అనే వ్యక్తి అతడిని డబ్బులు అడిగాడు. తన వద్ద లేవని ఎబినేజర్ పొమ్మన్నాడు. దీంతో కోపగ్రస్తుడైన దేవ్ కుమార్ పక్కనే ఉన్న రాడ్‌తో అతడి తలపైన బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే పడిపోయాడు. ఆపై జేబులో ఉన్న రూ.750 తీసుకుని దేవ్ కుమార్ పారిపోయాడు. ఇది కూడా చదవండి: సీఎం చంద్రబాబుని కలిసిన చిరంజీవి.. కారణం ఏంటంటే? ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుడు దేవ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం అప్పి యార్డు సమీపంలో నిందుతుడ్ని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. తన పేరు దేవ్ కుమార్ అని, తనది బీహార్‌లోని షైనీ దర్ఫారీ గ్రామం అని చెప్పాడు. జీవానాధారం కోసం విజయవాడ వచ్చానని తెలిపాడు. #murder #crime-news #loco-pilot మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి