/rtv/media/media_files/2025/03/13/PmVGEJS4CM15Sn0zfTlM.jpg)
Vijayanagaram
Vijayanagaram: విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన వేణుగోపాలస్వామి జాతరలో కొందరు యువకులు తాగిన మత్తులో వీరంగం సృష్టించారు. జాతరలో అసభ్యకర నృత్యాలను అడ్డుకున్నందుకు డ్యూటీలో ఉన్న మహిళా ఎస్సై పై రెచ్చిపోయారు. జుట్టు పట్టుకొని ఆమెపై దాడి చేయడంతో ప్రాణా భయంతో అక్కడి నుంచి వెళ్లి ఓ ఇంట్లో దాక్కున్నారు.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతర సందర్భంగా ఊళ్ళో డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం నిర్వహించాగ.. మద్యం మత్తులో అక్కడికి వచ్చిన కొందరు యువకులు స్టేజ్ పై డాన్స్ వేస్తున్న అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న వల్లంపూడి ఎస్.ఐ. బి.దేవి వారిని వారించారు. దీంతో మహిళా ఎస్సై పై రెచ్చిపోయారు. వైకాపా యువ నాయకుడి అండతో ఏ మాత్రం భయం లేకుండా ఎస్సై పై దాడి చేశారు. ఆమె జుట్టు పట్టుకొని కొట్టారు.
ఇది కూడా చూడండి: Kartik Aaryan: కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్.. కన్ఫామ్ చేసిన హీరో తల్లి?
అదుపులోకి తీసుకున్న పోలీసులు
విషయం తెలుసుకున్న పోలీసులు దాడిని తీవ్రంగా పరిగణించారు. వెంటనే గ్రామీణ సీఐ అప్పలనాయుడు, మరికొందరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు గుడివాడ చేరుకున్నారు. మహిళా ఎస్సై పై దాడికి పాల్పడిన వారంతా వైకాపా యువనాయకుడి ఇంట్లో ఉన్నారని తెలుసుకొని.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై దేవి ఫిర్యాదు, జాతరలో వీడియో క్లిపింగ్స్ ఆధారంగా ఎస్.గౌరీనాయుడు, జి.సంతోష్‌కుమార్, జి.కిశోర్, కె.విష్ణు, బి.దుర్గారావు, టి.హర్షవర్థన్, ఆర్.యెర్నిబాబు, జి.కృష్ణమ్మ, బి.సింహాచలం నాయుడులను అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గాయాలైన మహిళా ఎస్సై ని ఆస్పత్రికి తరలించారు.