/rtv/media/media_files/2025/03/13/UDHEBzhZaHy3NmtOesy8.jpg)
Viral Video school Photograph: (Viral Video school)
ఎక్కడైనా టీచర్లు పిల్లలను దండిస్తారు. స్కూల్‌కి ఆలస్యంగా వచ్చినా, చెప్పిన వర్క్ చేయకపోయినా కూడా టీచర్లు కొట్టడం, గుంజీలు తీయించడం వంటి చేస్తుంటారు. కానీ విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలంలో ఉన్న ఓ స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లలను దండిచకుండా పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పారు. స్కూల్ పిల్లలు చదువులో వెనుక పడ్డారని, జెడ్‌పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ చింత రమణ విద్యార్థులను దండించలేదు. వినూత్నంగా పిల్లల ముందే గుంజీలు తీసి క్షమించమని కోరారు.
ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!
విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్‌పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని....విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టరు గారూ!… pic.twitter.com/Se7zu6uwf5
— Lokesh Nara (@naralokesh) March 13, 2025
ఇది కూడా చూడండి: Train Hijack: రైలు హైజాక్ ..ఆపరేషన్ సక్సెస్ అంటున్న పాక్ ఆర్మీ!
పిల్లల బంగారు భవిష్యత్తుకి పునాది వేద్దామని..
మిమ్మల్ని కొట్టలేమని, తిట్టలేమని, ఏమీ కూడా చేయలేమని.. మీ దగ్గర చేతకానితనంగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. పిల్లలను దండించకుండా వారిని అర్థం చేసుకునేలా మీ కొత్త ఆలోచన బాగుందని అభినందనలు తెలిపారు. అందరం కలిసి విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషి చేసి బంగారు భవిష్యత్తును ఇద్దామని లోకేష్ పోస్ట్ చేశారు.
ఇది కూడా చూడండి: బిగ్ షాక్ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !
ఇది కూడా చూడండి: గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్