/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/chandrababuamaravathi1-1719476597.jpg)
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 57 కి. మీ పొడవున కొత్త రైల్వే వంతెన నిర్మాణం జరగడానికి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.2245 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కృష్ణ నదిపై 3.2 కి.మీ పొడవు మేర మూడు బ్రిడ్జ్‌ల నిర్మాణం జరగనుంది.
ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన!
Railway minister Update - new railway one for Amaravathi
— Lokesh journo (@Lokeshpaila) October 24, 2024
రూ. 2,245 కోట్లతో 57 కి.మీ అమరావతి రాజధానికి కొత్త రైల్వే లైన్
అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ.. కొత్త లైన్
దక్షిన భారతాన్ని మద్య, ఉత్తర భారతంతో అనుసంధానం మరింత సులువు. pic.twitter.com/IAunGGPRhw
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను కలుపుతూ..
హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, నాగపూర్‌తో పాటు దేశంలో ఉండే ప్రధాన మెట్రో నగరాలను కలిపి రైల్వే కనెక్టవిటీని నిర్మించనున్నారు. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు.
ఇది కూడా చూడండి: పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి?
ఈ కొత్త రైల్వే లైన్‌ను అమరావతి స్థూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వరస్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్ట్‌కి వెళ్లే వారికి అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు. అలాగే కృష్ణ పట్నం, మచిలీపట్నం, కాకినాడ పోర్టులను కూడా కలుపుతూ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఇది కూడా చూడండి: Samantha : ప్రభాస్ - సమంత కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?
ఏపీతో పాటు బిహార్‌కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. బిహార్‌లో కొత్త రైల్వే లైన్‌కు రూ.4553 కోట్లు కేటాయించింది. ఈ రైల్వే లైన్‌కు సంబంధించి ఇప్పటికే ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ఈ కొత్త రైల్వే లైన్ వల్ల రాష్ట్ర రాజధాని అయిన అమరావతికి రవాణా కనెక్టివిటీ వల్ల అభివృద్ధి పెరుగుతుందని రాష్ట్రం భావిస్తోంది.
ఇది కూడా చూడండి: IAS Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్!