/rtv/media/media_files/2026/03/14/ap-jobs-2026-03-14-15-11-59.jpg)
Ugadi gift for the unemployed in AP.
AP Jobs: ఇకముందు ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఉగాది రోజున ప్రకటించనున్న జాబ్ క్యాలెండర్ కు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తు మొదలు పెట్టింది. గడచిన మూడేళ్లకాలంలో వివిధ శాఖల్లో ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలకు సంబంధించి 10,060 పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
కాగా ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి సమాచారం సేకరించడానికి శుక్రవారం ఏపీ సచివాలయంలో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం నిర్ణయించింది. ఈ సందర్భంగా
పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌లో కలిపి 3 వేల ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాల్లో 1500 అసిస్టేంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక పోలీస్ విభాగంలో ఎస్సై, కానిస్టేబుళ్లు కలిపి 3వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తారు, ఏఈలు 500, సంక్షేమ వసతిగృహాల వార్డెన్లు 200, అటవీశాఖ పోస్టులు 100, స్టాటిస్టిక్స్ అధికారి పోస్టులు 200, గ్రూపు-1లో 100, గ్రూపు-2లో 500 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు.
వీటన్నింటిని భర్తీ చేసేందుకు ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయాలనే దానిపై క్లారిటీ రానున్నదని అధికారులు తెలిపారు.
Follow Us