/rtv/media/media_files/2025/01/13/ggrKWgeowZ9jd5fKluWX.jpg)
TTD Chairman Press Meet
తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన, పటిష్టమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్ లో సోమవారం టీటీడీ ఈవ, అదనపు ఈవోలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి భక్తులకు పాదర్శకంగా సేవలు అందించేందుకు పాలక మండలిలో సమిష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. పాలకమండలి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడంలో కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతుండవచ్చనేమో కానీ ఆలస్యం అవుతోందని తొందరపడి అసత్య ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. తిరుమల విషయంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించి, సంబంధిత వ్యక్తుల నుంచి వాస్తవ సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు. ఒకరిద్దరు మీడియా, సోషల్ మీడియాలో టీటీడీ ఛైర్మెన్ కు, ఈవో శ్రీ శ్యామల రావుకు మనస్పర్థలు ఉన్నాయంటూ వార్తలు రాయడం సరికాదన్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్ కు బిగ్ షాక్.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు తిరిగి BRSలోకి!
వైకుంఠ ఏకాదశికి శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించామన్నారు. విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, శ్రీవారి దర్శనం, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలలో మరింత నాణ్యతగా అందించామన్నారు. తిరుపతిలో తొక్కిసలాట సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 31 మందికి పరిహారం అందించామని, మరో 20 మందికి రెండు మూడు రోజుల్లో పరిహారం అందిస్తామన్నారు. చిన్న పొరపాట్లు చేయకుండా చాలా ముందు జాగ్రత్తతో సేవలు అందిస్తున్నామన్నారు.
శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నాం - టిటిడి
— B R Naidu (@BollineniRNaidu) January 13, 2025
ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు.
తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన, పటిష్టమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు… pic.twitter.com/XFXiPc8bUi
అసత్యాలు చేయొద్దు: ఈవో
టీటీడీకి సంబంధించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దని ఈవో జె. శ్యామలరావు విన్నవించారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా చేస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని సూచించారు. టిటిడిలో పాలక మండలిలో చర్చించి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం తమ బాధ్యతన్నారు. టీటీడీ చైర్మన్, ఈవో మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవన్నారు. సమన్వయ లోపం అసలు లేదన్నారు. టీటీడీ చైర్మన్ ను తాను ఏకవచంతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు నిజం కాదన్నారు. టీటీడీలో దళారి వ్యవస్థను పూర్తిగా కట్టడి చేస్తున్నామన్నారు. ఆన్ లైన్ లో మోసాలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించి చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇది కూడా చదవండి: TG: డమ్మీ చెక్కులిస్తున్న సీఎం రేవంత్.. హరీష్ రావు సంచలన ఆరోపణలు!
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు టీటీడీ ఈవో మాట్లాడుతూ.. తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం, క్యూలైన్లు, అన్నప్రసాదాలు, కంపార్ట్మెంట్ల నిర్వహణ, వసతి, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలు పూర్తిగా టీటీడీ పరిధిలో ఉంటుందన్నారు. తిరుపతిలో జన రద్దీని ఎలా అదుపు చేయాలి, జన రద్దీ నిర్వహణ, క్యూలైన్ మేనేజ్మెంట్, భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎంత ఎత్తులో ఉండాలి? ఎన్ని ఏర్పాటు చేయాలి? వాటి పటిష్టత ఎంత ఉండాలనే అంశాలు పూర్తిగా జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఉంటుందన్నారు. వారి సూచనల మేరకు టీటీడీ ఏర్పాట్లు చేసిందన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమన్వయం చేసుకుని, వారి సూచనల మేరకు టోకెన్లు జారీ చేస్తామన్నారు. ఎక్కడైనా జన రద్దీని పూర్తిగా అదుపు చేయాల్సిన బాధ్యత ఎస్పీ చేతిలో ఉంటుందన్నారు. భక్తుల తోపులాట అంశంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ జరుగుతోందని, న్యాయ విచారణలో పూర్తి విషయాలు వెల్లడవుతాయన్నారు.