/rtv/media/media_files/2025/03/31/F6oro0OZzgiZARRSGkN1.jpg)
Hyderabad-Vijayawada Highway
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం ఫుల్ రష్ గా ఉంటుంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండటంతో రోజుకూ వేల వాహానాలు వెళ్తుంటాయి. అయితే ఈ రహాదారి గుండా ప్రయాణించే వాహనాదారులకు ఎన్‌హెచ్‌ఏఐ గుడ్న్యూస్ చెప్పింది. టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31వరకు అమలులో కొత్త రేట్లు అమల్లో ఉండనున్నాయి. ఇది వాహనదారులకు ఊరటనిచ్చే అంశమేగానే పేర్కొనవచ్చు.
Also read : UP Crime: అలహాబాద్ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య!
2012 డిసెంబర్ నుంచి టోల్ వసూళ్లు
హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు (నందిగామ) వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. 2012 డిసెంబర్ నుంచి టోల్ వసూళ్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఛార్జీలను కుదించారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌లకు అయితే ఒక వైపు ప్రయాణానికి అయితే రూ.15, ఇరువైపులా కలిపి రూ.30. లైట్ వేయిట్ వాహనాలను ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు. ఇక చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ ఛార్జీలో 25 శాతం మినహాయింపు లభిస్తుంది.
గతంలో ఈ రహాదారిని జీఎమ్మార్ సంస్థ నిర్మించింది. 2024 జూన్ 31 వరకు టోల్ వసూలు చేశారు. ఆ తరువాత ఎన్‌హెచ్‌ఏఐ టోల్ వసూలు బాధ్యతలు తీసుకుంది. జీఎమ్మార్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ ఛార్జీలు పెంచేవారు. కానీ ఇప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ టోల్ వసూలు చేస్తుండటంతో టోల్ ఛార్జీలు తగ్గించారు.
Also Read : Betting App: బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశం