తిరుమలలో చిరుతల కలకలం.. ఉలిక్కిపడ్డ భక్తులు
తిరుమలలో భక్తులకు రెండు చిరుతలు కనిపించాయి. దీంతో వారు కేకలు వేయడంతో అవి సమీప అడవిలోకి పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో భక్తులు గుంపులుగా మాత్రమే వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
తిరుమలలో భక్తులకు రెండు చిరుతలు కనిపించాయి. దీంతో వారు కేకలు వేయడంతో అవి సమీప అడవిలోకి పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో భక్తులు గుంపులుగా మాత్రమే వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. అలపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించాయి. దీంతో వాటిని చూసిన భక్తులు భయంతో హాహాకారాలు చేశారు. వాళ్ల అరుపులు విని చిరుతలు అడవిలోకి పారిపోయాయి.
ఏపీ అల్లర్లపై డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు సిట్ నివేదిక అందించింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ 150 పేజీల ప్రాథమిక నివేదికను అందజేశారు. హింసాత్మక ఘటనలపై రెండురోజులపాటు ఆరా తీశారు. మరోవైపు అల్లర్లపై పారదర్శకంగా విచారణ చేయాలని సిట్ చీఫ్ ను కలిశారు వైసీపీ నేతల బృందం.
ఏపీలో సోమవారం భారీ వర్షాలు కురుస్తుయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తమిళనాడులో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా మహారాష్ట్ర నుంచి సౌత్ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ గత నాలుగు రోజులుగా కొనసాగుతుంది. భక్తులతో కంపార్ట్ మెంట్లు అన్ని కూడా నిండిపోయాయి. ఉచిత సర్వ దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్థన్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత కొన్నిరోజులుగా ప్రజల్లో పోలీసులపై విశ్వాసం తగ్గుతోందన్నారు. రాబోయే కాలంలో పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా ప్రయత్నం చేస్తామని, రాజీకీయ నాయకులు చట్టాన్ని ఉల్లఘించవద్దని కోరారు.
ఏపీలో అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. తిరుపతి మహిళావర్సిటీ స్ట్రాంగ్ రూం దగ్గర జరిగిన ఘటనపై సిట్ బృందం అధికారులను విచారిస్తున్నారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్నారు.
ఏపీలో మూడు జిల్లాలకు ఎన్నికల కమిషన్ ఎస్పీలను నియమించింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గర్గ్, తిరుపతి - హర్షవర్ధన్, అనంతపురం - గౌతమి శాలిని నియమించింది ఈసీ. ఎన్నికల సమయంలో హింస చెలరేగడంతో ఈ జిల్లాల ఎస్పీలపై ఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే.