AP: తిరుపతి జిల్లాలో చిరుత కలకలం
తిరుపతి జిల్లా చంద్రగిరి కొటాల పంచాయతీలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. జగనన్న కాలనీలో సాయంత్రం పని ముగించుకుని వస్తున్న కూలీలు చిరుతని చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి కొటాల పంచాయతీలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. జగనన్న కాలనీలో సాయంత్రం పని ముగించుకుని వస్తున్న కూలీలు చిరుతని చూసి షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
AP: నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. నేషనల్ హైవే ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. అనంతరం మదనపల్లిలో పర్యటిస్తారు. రాత్రి తిరుమలలో బస చేయనున్నారు.
వెంకయ్యను టీటీడీ జేఈవోగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనను డిప్యుటేషన్‌పై పంపేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో వెంటనే ఉత్తర్వులను ఇచ్చింది.
ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. మరోవైపు ఉపరితలం ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల మంగళవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
కువైట్ బాధితుడు శివకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. ఎన్ఆర్ఐ లకు సమాచారం అందించి శివను సొంత గ్రామానికి రప్పించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అన్నివిధాలా ఆదుకుంటామని శివ కుటుంబానికి లోకేష్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జులై 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. జులై 22న వర్చువల్ సేవల కోటా విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. జులై 23న అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేయనుంది.
నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 150 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థత గురయ్యారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జులై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కారణంగా జులై 15న సిఫారసు లేఖలు ఏవి కూడా అనుమతించడం కానీ, స్వీకరించడం కానీ జరగదని స్పష్టం చేశారు.
తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ నగర్లో వాచ్మెన్ భార్య దారుణ హత్యకు గురయింది. దుండగులు ఇంట్లో చొరబడి ఆమె గొంతు కోసి హతమార్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం భర్త రామిరెడ్డి కడపకు వెళ్లినట్లు తెలుస్తోంది. అంధురాలైన కుమార్తెతో ఇంట్లో ఉన్న వాచ్మెన్ భార్యపై దాడి చేసి చంపారు.