TTD: ధర్మారెడ్డి ఎక్కడ? ఆ మౌనం వెనక కారణమేంటి!

తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మౌనం వీడకపోవడం చర్చనీయాంశమైంది. తిరుపతి నెయ్యి ఒప్పందాలు ధర్మారెడ్డి హయాంలోనే జరిగాయని, అయినప్పటికీ ఆయన ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనేది హాట్ టాపిక్‌గా మారింది.

New Update
drer

TTD: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఆరోపణలు రావడంపై ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని చర్చలు జరుగుతున్నాయి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. గంటపాటు మీడియా ముందు కూర్చొని ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఈ వివాదంపై వైసీపీతోపాటు వైసీపీ హయాంలో పనిచేసిన అధికారులనుంచి స్పందన కరువైంది. ముఖ్యంగా టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మీడియా ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది. ధర్మారెడ్డి హయాంలోనే నెయ్యి కొనుగోళ్ల కాంట్రాక్టులో మార్పు జరిగిందని, ఏదైనా ఆయనే మీడియాతో మాట్లాడాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి. అంతేకాదు జగన్ కంటే ధర్మారెడ్డి మాత్రమే ఈ కేసుపై మరింత సమాచారం ఇవ్వగలరని, ఈ విషయంపై అతనికి మొదటి సమాచారం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ గొడవ మొదలైనప్పటి నుంచి ఒక్కసారి కూడా మీడియా ధర్మారెడ్డి మీడియా ముందుకు రాలేదు.

ధర్మారెడ్డి జాడ లేదు..


గతంలో ధర్మారెడ్డి క్యూరియస్ కేసుపై ఏపీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. బడ్జెట్ అనుమతులు లేకుండానే సివిల్ వర్క్ కాంట్రాక్టులను ధర్మారెడ్డి కేటాయించడం వివాదంగా మారి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇప్పుడు ఈ లడ్డూ వివాదం అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ధర్మారెడ్డి జాడ లేదు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ (ఐడీఈఎస్)లో ఉద్యోగి అయిన ధర్మారెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీకి డిప్యూటేషన్‌పై వచ్చారు. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి పనిచేసిన సమయంలో అధికార పార్టీ నేతలను పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో అధికారం మారిన తర్వాత ధర్మారెడ్డి పదవి విరమణ చేశారు. 

ప్రస్తుతం తిరుమలకు నెయ్యి ఒప్పందాలపై నాడు ధర్మారెడ్డి హయాంలో జరిగినదనే చర్చ జరుగుతుంది. ధర్మారెడ్డి ఆ సమయంలో కీలకపాత్ర పోషించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఆయన ఏం జరిగిందో బయటికి వచ్చి చెప్పటం లేదు. దీంతో ధర్మారెడ్డి మౌనం వెనుక అసలు కారణమేంటని చర్చ మొదలైంది. ధర్మారెడ్డి ఇప్పటికైనా బయటికి వస్తారా. ఏం జరిగిందో వివరిస్తారా అనే ఉత్కంఠగా మారింది.  ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ధర్మారెడ్డి పైన సంచలన ఆరోపణలు చేశారు. ధర్మారెడ్డి తన కుమారుడు చనిపోతే 12వ రోజు తిరుమలకు వచ్చారని.. ఆలయ సాంప్రదాయాలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అన్ని విషయాలపైన విచారణ చేయనుంది. అందులో ధర్మారెడ్డిని సైతం విచారించే అవకాశం ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు