లడ్డూ సాకుతో చంద్రబాబు కుట్ర.. వారంతా రక్తం కక్కుకుని చస్తారు! తిరుపతి లడ్డూ సాకుతో చంద్రబాబు కుట్రకు తెరలేపుతున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. నెయ్యి కాదు చంద్రబాబు మనసు కలుషితమైందన్నారు. తప్పు చేసిన వారు రక్తం కక్కుకుని చస్తారంటూ ఫైర్ అయ్యారు. By srinivas 22 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Tirupati Laddu: తిరుపతి లడ్డూ సాకుతో రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు భారీ కుట్రకు తెరలేపుతున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు శ్రీవారిని పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని, విజిలెన్స్ కమిటీ ద్వారా మూడు నెలలు తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోయేసరికి కుట్రకు పూనుకున్నారని ఆరోపించారు. భగవంతుడుకు ప్రీతి పాత్రమైన లడ్డుపై ఘోరమైన నేరం.. అపచారం చేశారు. చంద్రబాబు శ్రీవేంకటేశ్వర స్వామి అన్యాయాలు చూస్తూ ఊరుకోరు. చంద్రబాబు ఆరోపణలు నిరూపించడానికి సుప్రీం కోర్టు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వారు రక్తం కక్కుకుని చావాలి.. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. తిరుపతిని అపహస్యం చేసిన వారు రక్తం కక్కుకుని చావాలని వేంకటేశ్వర స్వామిని కోరుతున్నాం. స్వామియే వారికి సరైన శిక్ష విధిస్తారు. చంద్రబాబు.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, నేడు పులా మాలలు వేస్తున్నాడు. భక్తుల మనోభావాలను సర్వ నాశనం చేసేందుకు చంద్రబాబు పూనుకున్నారు. చంద్రబాబును చూస్తే శకుని బతికి ఉంటే మిమ్మల్ని చూసి బావురుమనే వాడు. భయపడి పారి పోయేవాడు. మీరు బెదిరించిన తర్వాత పంది కొవ్వు, చేప నూనె ఉన్నాయని ఈవో చెప్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జంతు నెయ్యి వాడారు అని అబద్ధాలు చెబుతున్నారు. మీ పాలనలో ఆరు నెలలు నందిని డైరి వాడారు అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా మీపాలనలో ఎలా జరిగింది. మీరు కాదా మీ హయాంలో 14 సార్లు తిరిగి పంపించినది వాస్తవం కాదా? గత మీ పాలనలో సరఫరా చేసిన కంపెనీలే ఇప్పుడు నెయ్యి సరఫరా చేస్తున్నాయి. నెయ్యికాదు మీ మనసు కలుషితం అయిందంటూ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక 100 రోజులు పాలనలో ఇచ్చిన హామీలు విస్మరించారని, దానికి ప్రాయచిస్తం చేసుకోవాలన్నారు. #ap-cm-chandrababu #bhumana-karunakar-reddy #Tirupati Laddu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి